ETV Bharat / bharat

ఝార్ఖండ్‌లో జయభేరి మోగించిన జేఎంఎం కూటమి - హేమంత్ సోరెన్​కు ప్రధాని అభినందనలు - ASSEMBLY ELECTION RESULTS 2024

Jharkhand Election Results 2024
Jharkhand Election Results 2024 (Etv Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 23, 2024, 8:01 AM IST

Updated : Nov 23, 2024, 6:34 PM IST

Assembly Election 2024 : ఝార్ఖండ్‌లో అధికార జేఎంఎం కూటమి అధికారం నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఆధిక్యంలో కొనసాగుతున్న జేఎంఎం మ్యాజిక్​ ఫిగర్​కు చేరువలో ఉంది. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను తలకిందులు చేస్తూ కౌంటింగ్ ఆరంభం నుంచే జేఎంఎం జోరును కొనసాగిస్తోంది. ఈసారైన అధికారాన్ని దక్కించుకోవాలనుకున్న బీజేపీ నేతృత్వంలోని ఎన్​డీఏకి ఈ ఎన్నికల్లో నిరాశ తప్పేలా లేదు.

LIVE FEED

9:19 PM, 23 Nov 2024 (IST)

ఝార్ఖండ్‌ ఎన్నికలు- EC ప్రకారం పార్టీల వారీగా తుది ఫలితాలు

  • జేఎంఎం - 34
  • బీజేపీ - 21
  • కాంగ్రెస్‌ - 16
  • ఆర్జేడీ - 04
  • సీపీఐ (ఎంఎల్‌) (ఎల్‌) - 02
  • ఏజేఎస్‌యూపీ - 01
  • ఎల్‌జేపీఆర్‌వీ - 01
  • జేకేఎల్‌ఎం - 01
  • జేడీయూ - 01
  • మొత్తం - 81

6:28 PM, 23 Nov 2024 (IST)

ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలు తారుమారు - ఝార్ఖండ్‌లో అధికారం నిలబెట్టుకున్న జేఎంఎం కూటమి

ఝార్ఖండ్‌లో అధికార జేఎంఎం కూటమి జయభేరి మోగించింది. ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలను తారుమారు చేస్తూ ఝార్ఖండ్‌లో తమ అధికారాన్ని నిలబెట్టుకుంది. 81 అసెంబ్లీ స్థానాలున్న ఝార్ఖండ్‌లో మెజార్టీ మార్క్‌ 41కాగా, ఏకంగా 56 స్థానాల్లో జేఎంఎం కూటమి గెలుపొందింది. 43 స్థానాల్లో పోటీ చేసిన ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా జేఎంఎం ఏకంగా 34 చోట్ల గెలుపొందగా, మిత్రపక్షాలైన కాంగ్రెస్‌ 16 చోట్ల, ఆర్జేడీ నాలుగు స్థానాల్లో, సీపీఐ ఎంఎల్‌ రెండు స్థానాల్లో విజయం సాధించాయి.

ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 24 స్థానాలకే పరిమితమైంది. 68 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ కేవలం 21 స్థానాలే దక్కించుకోగా, మిత్రపక్షాలైన ఎల్‌జేపీ రామ్‌విలాస్‌ పాసవాన్‌ పార్టీ, జేడీయూ, ఏజేఎస్​యూ తలో స్థానంలో గెలుపొందాయి. జేఎల్​కేఎం పార్టీకి ఒక స్థానం దక్కింది.

సోరెన్​ ఘన విజయం
బర్హెట్‌లో ఝార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ 39 వేలకుపైగా ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఆయన భార్య కల్పనా సోరెన్‌ గండేలో 13 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. దుమ్‌కా అసెంబ్లీ నియోజకవర్గంలో హేమంత్‌ సోరెన్‌ సోదరుడు బసంత్‌ సోరెన్‌ 14,588 ఓట్ల మెజార్టీతో నెగ్గారు. ధన్వార్‌లో ఝార్ఖండ్‌ బీజేపీ అధ్యక్షుడు బాబులాల్‌ మరాండి 25 వేలకుపైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సరయ్‌కెలాలో ఝార్ఖండ్‌ మాజీ సీఎం, బీజేపీ అభ్యర్థి చంపయీ సోరెన్‌ 20 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంతో నెగ్గారు. చందన్‌కియారీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి, ఝార్ఖండ్‌ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత అమర్‌ కుమార్‌ మూడోస్థానంలో నిలిచారు. ఇక్కడ జేఎంఎం అభ్యర్థి ఉమాకాంత్‌ రజక్‌ 33 వేలకుపైగా ఓట్ల మెజార్టీతో నెగ్గారు.

ఇండియా కూటమిలో భాగంగా ఉన్న ఆర్జేడీ ఈ ఎన్నికల్లో ఆశ్చర్యకర ఫలితాలు సాధించింది. ఝార్ఖండ్‌లో పోటీ చేసిన 6 స్థానాల్లో నాలుగింటిలో గెలిచింది. 2019 ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ కేవలం ఒక్కస్థానంలోనే నెగ్గింది. 2024 ఎన్నికల్లో జేఎంఎం, కాంగ్రెస్‌, ఆర్జేడీ, సీపీఐఎంఎల్‌ కలిసి పోటీ చేశాయి.

బీజేపీకి మరోసారి నిరాశే!
ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సంధించిన బంగ్లాదేశ్‌ చొరబాటుదారుల అంశం ఆ పార్టీకి పెద్ద ఓట్లు సంపాదించలేకపోయింది. అదే సమయంలో జేఎంఎం ప్రయోగించిన ఆదివాసీ కార్డు సత్ఫలితాలను ఇచ్చింది. అవినీతి కేసులో జేఎంఎం చీఫ్‌ హేమంత్‌ సోరెన్‌ అరెస్టు కావడం కూడా ఆ పార్టీ పట్ల ప్రజల్లో సానుభూతిని పెంచింది. చొరబాట్ల అంశంపైనే ఎక్కువగా ప్రచారం చేయడం, ఆదివాసీ సీఎం అభ్యర్థిని ప్రొజెక్ట్‌ చేసుకోలేకపోవడం తమకు ప్రతికూలంగా మారినట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు. సంప్రదాయ ఓట్లైన ఆదివాసీ, ముస్లిం, క్రిస్ట్రియన్లు సహా సంక్షేమ పథకాల కారణంగా మహిళా ఓట్లను కూడా పెద్ద ఎత్తున జేఎంఎం కూటమి ఆకర్షించగలిగింది.

ఝార్ఖండ్‌లోని 81 అసెంబ్లీ స్థానాలకు నవంబర్‌ 13, 20 తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్‌ జరిగింది. తొలి విడతలో 43 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరగ్గా, మిగిలిన 38 స్థానాలకు రెండో విడతలో పోలింగ్‌ నిర్వహించారు. ఈసారి రికార్డు స్థాయిలో 67.74 శాతం పోలింగ్‌ నమోదైంది.

4:54 PM, 23 Nov 2024 (IST)

  • బర్హెట్‌లో ఝార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ ఘన విజయం
  • తన ప్రత్యర్థిపై 40 వేల ఓట్ల మెజారిటీతో గెలుపు

4:54 PM, 23 Nov 2024 (IST)

JMM కూటమికి అభినందనలు : ప్రధాని మోదీ

ఝార్ఖండ్​ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. తమకు మద్దతు ఇచ్చినందుకు ఝార్ఖండ్​ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజల సమస్యల గురించి మాట్లాడే విషయంలో, రాష్ట్రం కోసం పని చేసేందుకు ఎల్లప్పుడూ ముందుంటామని పేర్కోన్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన జేఎంఎం కూటమికి అభినందనలు తెలిపారు.

4:37 PM, 23 Nov 2024 (IST)

  • ఝార్ఖండ్​లో అధికార జేఎంఎం ఘన విజయం
  • మ్యాజిక్​ ఫిగర్​ను క్రాస్ చేసిన జేఎంఎం
  • మరో 15 స్థానాల్లో ఆధిక్యం

4:36 PM, 23 Nov 2024 (IST)

సీఎం హేమంత్ సోదరుడు విజయం

దుమ్కాలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సోదరుడు, జేఎంఎం అభ్యర్థి బసంత్ సోరెన్ జయకేతనం

బీజేపీ అభ్యర్థి సునీల్ సోరెన్‌పై 14,588 ఓట్ల తేడాతో గెలుపొందిన బసంత్‌

3:37 PM, 23 Nov 2024 (IST)

  • ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలకు భిన్నంగా ఝార్ఖండ్ ఫలితాలు
  • ఝార్ఖండ్‌లో జేఎంఎం కూటమి హవా
  • గండేలో విజయం సాధించిన హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్‌

2:20 PM, 23 Nov 2024 (IST)

  • ఝార్ఖండ్‌లో జేఎంఎం కూటమి 55, బీజేపీ నేతృత్వంలోని కూటమి 26 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నాయి. ఇతరులు ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలుండగా మ్యాజిక్‌ ఫిగర్ 41.

1:40 PM, 23 Nov 2024 (IST)

ఝార్ఖండ్‌లో ఖాతా తెరిచిన జేఎంఎం కూటమి

10:53 AM, 23 Nov 2024 (IST)

  • ఝార్ఖండ్‌లో 51 స్థానాల్లో జేఎంఎం కూటమి, 27 చోట్ల బీజేపీ కూటమి, ఒక అసెంబ్లీ స్థానంలో ఇతరులు లీడ్‌లో ఉన్నారు

10:16 AM, 23 Nov 2024 (IST)

  • ఝార్ఖండ్ సీఎం హేమంత్‌ సోరెన్‌ ముందంజ
  • గండేలో హేమంత్‌సోరెన్‌ భార్య కల్పనా సోరెన్‌ ఆధిక్యం
  • జంతారాలో సీతా సోరెన్‌ (భాజపా) ఆధిక్యం
  • ధన్వార్‌లో ఝార్ఖండ్‌ బీజేపీ అధ్యక్షుడు బాబులాల్‌ మరాండి ఆధిక్యం
  • సరాయ్‌కెలాలో ఝార్ఖండ్‌ మాజీ సీఎం చంపయీ సోరెన్‌ ముందంజ
  • ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలకు భిన్నంగా ఫలితాలు
  • ఆధిక్యంలో మ్యాజిక్‌ ఫిగర్‌ దాటిన జేఎంఎం కూటమి

10:08 AM, 23 Nov 2024 (IST)

ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలకు భిన్నంగా ఝార్ఖండ్ ఫలితాలు

ఝార్ఖండ్‌: ఆధిక్యాల్లో మేజిక్‌ఫిగర్‌ దాటిన జేఎంఎం కూటమి

9:36 AM, 23 Nov 2024 (IST)

ఝార్ఖండ్‌లో బీజేపీ, జేఎంఎం కూటమిలు నువ్వానేనా!

  • చెరో 9 స్థానాల్లో రెండు కూటమిల ఆధిక్యం
  • ఇతరులు 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మందంజ

9:01 AM, 23 Nov 2024 (IST)

  • ఝార్ఖండ్‌లో అధికార ఝార్ఖండ్ ముక్తి మోర్చా కూటమి 3 చోట్ల, బీజేపీ కూటమికి 4 స్థానాల్లో ఆధిక్యం

8:55 AM, 23 Nov 2024 (IST)

  • బర్హెత్‌లో ఝార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ ఆధిక్యం
  • గండేలో హేమంత్‌ సోరెన్‌ భార్య కల్పనా సోరెన్‌ ఆధిక్యం

8:06 AM, 23 Nov 2024 (IST)

  • ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం
  • ఝార్ఖండ్‌లో మెుత్తం అసెంబ్లీ స్థానాలు 81, మేజిక్‌ ఫిగర్‌ 41
  • ఝార్ఖండ్‌లో ఎన్డీఏ, ఇండియా కూటముల మధ్యే ప్రధాన పోరు
  • ఎన్డీయే కూటమిలో బీజేపీ, ఏజేఎస్‌యూ, జేడీయూ, లోక్‌జన్‌శక్తి
  • బీజేపీ 68, ఏజేఎస్‌యూ 10, జేడీయూ 2, లోక్‌జన్‌శక్తి(రామ్‌విలాస్) ఒకచోట పోటీ
  • ఇండియా కూటమిలో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ(ఎంఎల్‌)
  • జేఎంఎం 43, కాంగ్రెస్ 30, ఆర్జేడీ 6, సీపీఐ(ఎంఎల్‌) 4 చోట్ల పోటీ
  • ఝార్ఖండ్‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్న జేఎంఎం-కాంగ్రెస్ ప్రభుత్వం
  • ఝార్ఖండ్‌: తొలి విడతలో 43, రెండో విడతలో 38 స్థానాలకు పోలింగ్

6:49 AM, 23 Nov 2024 (IST)

రాష్ట్రంలోని 81 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 13, 20 తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్‌ జరిగింది. తొలి విడతలో 43 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగగా, మిగిలిన 38 స్థానాలకు రెండో విడతలో ఓటింగ్‌ నిర్వహించారు. తాజాగా వెలువడిన ఎగ్జిట్‌ పోల్స్‌ బీజేపీ కూటమికే అధికారం దక్కే అవకాశముందని అంచనా వేశాయి. ఝార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరగగా తొలిసారిగా 67.74శాతం పోలింగ్‌ నమోదయ్యింది. నవంబర్‌ 15, 2000లో రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఈస్థాయిలో పోలింగ్‌ నమోదు కావడం ఇదే తొలిసారి

Last Updated : Nov 23, 2024, 6:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.