ETV Bharat / state

జగన్‌- అదానీల స్కామ్​లో మీకు ఇవి తెలుసా? - YS JAGAN ADANI CORRUPTION

జగన్‌- అదానీల బంధం ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా? - తేదీలు, వేదికలతో సహా వెల్లడించిన అమెరికా దర్యాప్తు సంస్థ

YS_Jagan_Adani_Corruption
YS Jagan Adani Corruption (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 22, 2024, 10:07 AM IST

YS Jagan Adani Corruption: అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతికి పాల్పడడంలో ఆరితేరినవారు ఒకరైతే, కార్పొరేట్‌ మాయాజాలంలో అందెవేసినవారు మరొకరు. ఇద్దరూ కలిసి, భారీ కుట్రకు స్కెచ్‌ వేసి వేల కోట్ల రూపాయల కుంభకోణాన్ని చాకచక్యంగా చక్కబెట్టేశారు. వైఎస్ జగన్, అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ ఏపీలో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల పేరుతో చేసిన కుంభకోణం ఇది. ఎక్కడా అమ్ముడుపోని తన విద్యుత్‌ను అధిక ధరకు కొనుగోలు చేస్తే 1,750 కోట్ల రూపాయలు ఇస్తానని అదానీ ఆఫర్‌ చేశారు! ఆ ఒప్పందం కుదిరితే రాష్ట్ర ప్రజలపై దీర్ఘకాలంలో 1.10 లక్షల కోట్ల రూపాయల భారం పడుతుందని, ఇది రాష్ట్రానికి నష్టమని జగన్‌కూ తెలుసు! కానీ కోట్ల రూపాయలు వస్తుంటే, జనం ఎలా పోతే మనకేంటి అనుకున్నారేమో! ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల్ని పణంగా పెట్టి అదానీతో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలను చకచకా పూర్తిచేశారు. విద్యుత్‌ కొనాలంటూ కేంద్ర సౌరవిద్యుత్‌ సంస్థ నుంచి ప్రతిపాదన రావడం, దాన్ని మంత్రివర్గం ఆమోదించడం, అగ్రిమెంట్ చేసుకోవడం అంతా వేగంగా జరిగిపోయింది.

2021 సెప్టెంబరు 12: ప్రొడక్షన్‌ లింక్డ్‌ ఇన్సెంటివ్‌ స్కీం కింద రాజస్థాన్‌లో సౌర విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుకు 2019లోనే అదానీ సంస్థతో సెకి (Solar Energy Corporation of India) ఒప్పందం చేసుకుంది. తర్వాత సౌరవిద్యుత్‌ ధరలు తగ్గడంతో అదానీ సంస్థ కోట్‌ చేస్తున్న ధరకు విద్యుత్‌ కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రాలేదు. దాంతో నేరుగా గౌతమ్‌ అదానీ రంగంలోకి దిగారు. తాడేపల్లి ప్యాలెస్‌కు వెళ్లి వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు. అత్యంత గోప్యంగా జరిగిన ఆ భేటీలో జగన్, అదానీ మధ్య ఒక ‘అంగీకారం’ కుదిరింది.

2021 సెప్టెంబరు 15: అదానీ, జగన్‌ భేటీ అయిన 3 రోజుల్లోనే సెకి నుంచి ఏపీ ప్రభుత్వానికి ఒక లెటర్ వచ్చింది. రాజస్థాన్‌లో ఏర్పాటవుతున్న విద్యుత్‌ సంస్థలు యూనిట్‌ 2.49 రూపాయల చొప్పున సరఫరా చేసేందుకు ముందుకు వచ్చాయని, పాతికేళ్లపాటు ఆ విద్యుత్‌ కొనేందుకు తమతో ఒప్పందం చేసుకోవాలని ఏపీ విద్యుత్‌శాఖ కార్యదర్శికి సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (SECI) లేఖ రాసింది.

2021 సెప్టెంబరు 16: మామూలుగా విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం ప్రతిపాదన వస్తే, దాన్ని ఆ శాఖ కార్యదర్శి, మంత్రి పరిశీలించాక సీఎం దృష్టికి తీసుకెళ్తారు. ఆయన అంగీకరిస్తే, క్యాబినెట్ ఆమోదానికి పంపుతారు. ఇందుకు కొన్ని వారాల సమయం పడుతుంది. కానీ సెకి ప్రతిపాదనపై జగన్‌ సర్కార్ అత్యంత వేగంగా స్పందించింది. సెకి నుంచి లేఖ వచ్చిన తరువాత రోజే క్యాబినెట్ సమావేశం ఎజెండాలో పెట్టి, ఆమోదించారు. రాష్ట్రంలో 6 వేల 600 మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుకు అప్పటికే పిలిచిన టెండర్లను రద్దుచేసి మరీ, సెకి నుంచి విద్యుత్‌ కొనాలని మంత్రిమండలి తీర్మానించింది.

2021 డిసెంబరు: అదానీ రెన్యూవబుల్‌ ఎనర్జీ నుంచి 4 వేల 667 మెగావాట్లు, అజూర్‌ పవర్‌ ఇండియా లిమిటెడ్‌ నుంచి 2 వేల 333 మెగావాట్ల విద్యుత్‌ కొనుగోలుకు మొదట ఒప్పందం కుదిరింది. అజూర్‌ నుంచి తీసుకోవాల్సిన విద్యుత్‌ను కూడా అదానీ నుంచే తీసుకునేలా సెకి తర్వాత ప్రతిపాదించగా, దానికి కూడా ఆమోదం తెలిపింది. అంటే అదానీ, అజూర్‌ పేరుకే వేర్వేరు కంపెనీలు అయినా, ఆ రెండూ ఒకటేనని స్పష్టంగా తెలుస్తోంది. అమెరికా దర్యాప్తు సంస్థల నివేదికలూ ఇదే విషయాన్ని చెప్తున్నాయి. సెకి నుంచి యూనిట్‌ 2.49 రూపాయలకి కొనేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకునే సరికే, కొన్ని రాష్ట్రాలు ఇతర సౌరవిద్యుత్‌ సంస్థల నుంచి యూనిట్‌ 1.99 రూపాయలకి కొనేందుకు ఒప్పందాలు చేసుకున్నాయి. కానీ జగన్‌ సర్కార్ ఎన్ని ఆరోపణలు వచ్చినా లెక్కచేయకుండా సెకితో ఒప్పందం కుదుర్చుకుంది. పైగా ఈ ఒప్పందంతో ఆంధ్రప్రదేశ్​కి మేలు జరుగుతుందని బుకాయించింది.

వీళ్లిద్దరి బంధం చాలా కాస్ట్లీ - పోర్టుల నుంచి మీటర్ల దాకా అన్నీ అదానీకే

ఆ మీటింగ్స్ టాప్ సీక్రెట్: జగన్‌ సీఎంగా ఉండగా, పారిశ్రామికవేత్తలు వచ్చి ఆయన్ను కలిసింది చాలా అరుదు! ఎప్పుడైనా ఒకరిద్దరు పారిశ్రామికవేత్తలు వచ్చి కలిసినా, వారితో జగన్ మీటింగ్స్ ముక్తసరిగా జరిగేవి! కానీ, అదానీతో జగన్ భేటీలు చాలా ఆత్మీయ వాతావరణంలో జరిగేవి. సాధారణంగా పారిశ్రామికవేత్తలు వచ్చి సీఎంను కలిసి, రాష్ట్రంలో పెట్టుబడుల గురించి మాట్లాడితే, ముఖ్యమంత్రి కార్యాలయం ఆ సమాచారాన్ని మీడియాకు విడుదల చేస్తుంది. పెట్టుబడులు ఖాయమైతే, మీడియా సమావేశం ఏర్పాటుచేసి మరీ ప్రకటిస్తారు. అదానీ లాంటి ప్రముఖ పారిశ్రామికవేత్త వచ్చి జగన్​ని కలిస్తే ఇంకెంత హడావుడి చేయాలి? కానీ జగన్‌ను కలిసేందుకు అదానీ ఎప్పుడొచ్చినా, అత్యంత సీక్రెట్​గా ఉంచేవారు. చివరకు జగన్‌ సొంత పత్రిక, ఛానళ్లలో సైతం అందుకు సంబంధించిన వార్తలు వచ్చేవి కాదు.

2021 నవంబరు 20వ తేదీన జగన్‌తో అదానీ కుటుంబసభ్యులు చాలాసేపు సమావేశమయ్యారు. ఆ సమావేశం జరిగిన సంగతి తనకు తెలియదని నాటి పరిశ్రమల మంత్రి గౌతమ్‌రెడ్డి మీడియాకి చెప్పారు. అదానీ వచ్చి జగన్‌ను ఎప్పుడు కలిసినా తర్వాత కొద్దిరోజులకే ఆ సంస్థకు ఏ పోర్టో, ప్రాజెక్టో కట్టబెడుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటూ ఉండేది. 2021లో ఆగస్టు 7, సెప్టెంబరు 12వ తేదీల్లో జగన్‌తో అదానీ భేటీ అయి 1,750 కోట్ల రూపాయలు ముడుపుల విషయం మాట్లాడారని, తర్వాతే ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వంతో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు కుదిరాయని అమెరికా సంస్థలు పేర్కొన్నాయి. ఈ ఒప్పందం వల్ల అదానీ సంస్థకు 20 సంవత్సరాలలో 200 కోట్ల డాలర్ల నికర లాభం చేకూరుతుందని రిపోర్టులో పేర్కొంది.

అంటే ఈ స్కామ్ వల్ల ఎక్కువగా లబ్ధి పొందుతోంది అదానీ, జగన్‌లే! విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలపై వివిధ రాష్ట్రాల ప్రజాప్రతినిధులు, అధికారులకు అదానీ గ్రూప్‌ మొత్తంగా 2 వేల 29 కోట్ల రూపాయలు ఇవ్వజూపితే, దానిలో 1,750 కోట్ల రూపాయలు జగన్‌కే ఆఫర్‌ చేశారంటేనే వారి మధ్య బంధం అర్థమవుతోంది. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలకే అదానీ సంస్థ జగన్‌కు 1,750 కోట్ల రూపాయలు ముట్టజెప్పడమో, హామీ ఇవ్వడమో చేస్తే, ఇక ఐదేళ్లలో అదానీకి కృష్ణపట్నం, గంగవరం పోర్టులు, పలు విద్యుత్‌ ప్రాజెక్టులు, 27 లక్షల గృహ విద్యుత్‌ కనెక్షన్లకు మీటర్లు అమర్చే కాంట్రాక్ట్‌లకు ఎన్ని వేల కోట్ల రూపాయల ముడుపులు అందాయోనన్న చర్చ మొదలైంది.

జగన్​ అంటే లోకల్​ అనుకుంటివా? ఇంటర్నేషనల్​! - అవినీతిలో తగ్గేదేలే

తేదీలతో సహా వెల్లడి: జగన్‌తో అదానీ ఎప్పుడెప్పుడు తాడేపల్లి ప్యాలెస్‌లో భేటీ అయ్యారో అమెరికా సంస్థలు తమ దర్యాప్తు నివేదికల్లో తేదీలతో సహా స్పష్టం చేశాయి. ఆ తేదీల్లో జగన్, అదానీ భేటీ అయ్యారా? లేదా? అని చూస్తే, వారి భేటీ జరిగిందని తేలింది. 2021లో ఆగస్టు 7, సెప్టెంబరు 12, నవంబరు 20వ తేదీల్లో జగన్, అదానీ భేటీ అయ్యారని ఆ సంస్థలు పేర్కొన్నాయి. 2021 సెప్టెంబరు 12వ తేదీన అదానీ సోదరులు జగన్‌తో భేటీ అయ్యారు. అదీ సీక్రెట్​గానే ఉంచారు. ఆ భేటీ తర్వాతే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ప్రతిపాదన వచ్చింది. నవంబరు 20వ తేదీన భేటీ తర్వాత ఒప్పందంపై సంతకాలు జరిగాయి. దానికి ముందు 2021 ఆగస్టు 7వ తేదీన కూడా జగన్‌-అదానీ భేటీ అయ్యారని అమెరికా నివేదిక పేర్కొంది. ఆ రోజు గంగవరం పోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాటాను అదానీకీ విక్రయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

ఎంతో లోతైన దర్యాప్తు: అమెరికాలోని దర్యాప్తు సంస్థలు ఈ స్కామ్​లోని సూక్ష్మమైన అంశాలనూ వెలికితీశాయి. ముడుపులు చెల్లించే క్రమంలో ఎవరెవరు, ఎక్కడెక్కడ, ఎప్పుడెప్పుడు, ఎలా కలిశారు, వారిమధ్య ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి అనే వివరాలను కూడా వెల్లడించాయి. అమెరికాలో కూర్చొని మరీ ఆంధ్రప్రదేశ్​లోని తాడేపల్లి ప్యాలెస్‌లో జరిగిన భేటీల సారాంశాన్ని తమ అభియోగపత్రంలో పేర్కొన్నాయి. ఇలాంటి కేసుల్లో పరిశోధన, దర్యాప్తు ఎలా చేయాలి, ఆర్థిక నేరాల్లో అక్రమాలను ఎలా వెలుగులోకి తేవాలనేందుకు ఈ ఇన్వెస్టిగేషన్ ఒక అద్భుతమైన ఉదాహరణ. మన సీబీఐ, ఈడీ, ఏసీబీ, సీఐడీ వంటి సంస్థలు ఈ దర్యాప్తు చూసైనా ఎంతోకొంత నేర్చుకోవాలి. ఆంధ్రప్రదేశ్​లో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఐదు నెలలవుతోంది. జగన్‌ హయాంలో జరిగిన మద్యం స్కామ్ సహా అనేక కేసులు సీఐడీకి, ఇసుక స్కామ్ సహా మరికొన్ని కేసులను ఏసీబీకి ఇచ్చారు. ఏ ఒక్కదాంట్లోనూ ఈ తరహా దర్యాప్తు జరగలేదు. అంతగా పురోగతి కూడా లేదు.

సొంతలాభం కోసం ప్రజలపై భారాన్నీ లెక్కచేయని జగన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.