How to Make Ulavacharu Chicken Lollipops: రెగ్యూలర్‌గా మనలో చాలామంది రెస్టారెంట్ స్టైల్లో చికెన్ లాలిపాప్స్ ఇంట్లో ట్రై చేసి ఉంటారు. అయితే, ఎప్పుడూ అలానే కాకుండా ఈ సారి కొత్తగా ఉలవచారు చికెన్ లాలీపాప్స్ ట్రై చేయండి. ఈ లాలీపాప్స్ పార్టీలో బెస్ట్ స్టార్టర్‌గా ఉంటాయి. మరి సింపుల్‌గా ఉలవచారు లాలీపాప్స్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- చికెన్ లాలీపాప్స్ - 10
- కార్న్ ఫ్లోర్ - 2 టేబుల్‌స్పూన్
- మైదా - 2 టేబుల్‌స్పూన్
- కొద్దిగా కొత్తిమీర
- వెల్లుల్లి తరుగు - 2 టీస్పూన్లు
- పచ్చిమిర్చి తరుగు - టీస్పూన్
- అల్లం తరుగు - 2 టీస్పూన్లు
- ఉల్లిపాయ తరుగు - 2 టేబుల్‌స్పూన్
- అరోమాట్ పౌడర్ - టేబుల్‌స్పూన్
- కారం - అరటేబుల్‌స్పూన్
- నిమ్మరసం - టేబుల్‌స్పూన్
చికెన్ లాలీపాప్స్ ఫ్రై కోసం :
- వెల్లుల్లి తరుగు - టేబుల్‌స్పూన్
- పచ్చిమిర్చి తరుగు - టేబుల్‌స్పూన్
- రెడ్ క్యాప్సికం ముక్కలు - పావు కప్పు
- గ్రీన్ క్యాప్సికం ముక్కలు - పావు కప్పు
- యెల్లో క్యాప్సికం ముక్కలు - పావు కప్పు
- ఉల్లిపాయ - 1
- కారం - అరటీస్పూన్
- కప్పు - చిక్కని ఉలవచారు
తయారీ విధానం :
- ముందుగా శుభ్రం చేసిన లాలీపాప్స్ ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. ఆపై ఇందులో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ తరుగు, కొద్దిగా ఉప్పు వేసి కలపండి.
- అనంతరం అరోమాట్ పౌడర్, కారం, కాస్త కొత్తిమీర తరుగు, నిమ్మరసం పిండి ముక్కలకు మసాలాలు పట్టేలా మిక్స్ చేయండి.
- ఇప్పుడు కార్న్ ఫ్లోర్, మైదా వేసి, కొద్దిగా నీరు పోసి కలపండి.
- చికెన్ లాలీపాప్స్కి మాసాలా కోటింగ్ గట్టిగా ఉండాలని గుర్తుంచుకోండి. ఇక్కడ మీరు నీళ్లకు బదులుగా ఎగ్‌వైట్ కూడా ఉపయోగించుకోవచ్చు.
- ఇప్పుడు స్టవ్‌పై మూకుడు పెట్టి ముక్కలు మునిగేంత వరకు ఆయిల్ వేసి వేడి చేయండి.
- వేడివేడి నూనెలో లాలీపాప్స్ వేసి 2 నిమిషాలు అలానే ఉంచండి. స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసి లాలీపాప్స్ క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు వేపుకోండి.
- ఆపై వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి.
- చికెన్ లాలీపాప్స్ ఫ్రై చేయడం కోసం స్టవ్‌పై ఒక పాన్ పెట్టండి. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేయండి. ఆపై వెల్లుల్లి, పచ్చిమిర్చి తరుగు వేసి వేపండి. ఇప్పుడు రెడ్, గ్రీన్, యెల్లో క్యాప్సికం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేపండి.
- వీటిని 2 నిమిషాలు వేపిన తర్వాత కాస్త ఉప్పు, కారం వేయండి. అనంతరం చిక్కని ఉలవచారు, కొన్ని నీళ్లు పోసి కలపండి. ఉలవచారు చిక్కగా మారిన తర్వాత వేపుకున్న చికెన్ లాలీపాప్స్ వేసి 2 నిమిషాలు ఫ్రై చేయండి.
- ఆపై కాస్త కొత్తిమీర తరుగు చల్లి స్టవ్ ఆఫ్ చేయండి.
- ఇలా చేసుకుంటే వేడివేడి ఉలవచారు చికెన్ లాలీపాప్స్ మీ ముందుంటాయి.
- ఈ చికెన్ లాలీపాప్స్ నచ్చితే మీరు ఓ సారి ట్రై చేయండి.
ఆంధ్రా స్టైల్ 'స్పైసీ మటన్ లివర్ ఫ్రై' - మసాలాలు అవసరం లేకుండానే మరింత రుచికరం
నోరూరించే 'క్యారెట్ పచ్చడి' - పది నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు!