Blackmail on Madhu Private Hospital Chairman Gur Reddy in Adoni : కర్నూలు జిల్లాలో బ్లాక్ మెయిల్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఆదోని పట్టణంలో ఉన్న మధు ప్రైవేటు ఆస్పత్రి నిర్వాహకుడు గుర్రెడ్డిని బసాపురం గ్రామానికి చెందిన రఘునాథ్, అడివేశ్ అనే వ్యక్తులు బెదిరించారు. నిందితులు ఇద్దరూ ఆస్పత్రిలో వైద్య సేవలపై ఆర్టీఐ పిటీషన్లు వేస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.
చివరికి రూ. 50 లక్షలు డిమాండ్ చేయడంతో ఆసుపత్రి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. నోటీసులు ఇవ్వడానికి వెళ్లిన పోలీసులపై కూడా నిందితులు దాడి చేశారు. దీంతో బ్లాక్ మెయిల్, పోలీసులపై దాడి చేసిన నిందితులను అదుపులో తీసుకుని రిమాండ్‌కు తరలించామని ఆదోని ఒకటో పట్టణ సీఐ శ్రీరామ్ తెలిపారు.
"మధు హాస్పిటల్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు ఇద్దరు నిందితులపై కేసులు నమోదు చేశాం. ఆసుపత్రిలో ఎన్టీఆర్ వైద్యసేవల్లో అవకతవకలు జరుగుతున్నాయని కావాలనే ఇద్దరు నిందితులు ఆర్టీఐకి ఫిర్యాదులు చేస్తామని బెదిరించారు. ఈ ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలంటే రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదులో భాగంగా నిందితులకి నోటీసులు ఇవ్వడానికి ఇద్దరు కానిస్టేబుళ్లను పంపించాం. మాకు పెద్ద పెద్ద నాయకులు తెలుసు ఎలా నోటీసులు ఇస్తారంటూ పోలీసులపై దాడికి పాల్పడ్డారు. దీంతో బ్లాక్ మెయిల్, పోలీసులపై దాడి చేసిన నిందితులకు కౌన్సిలింగ్ ఇచ్చి రిమాండ్‌కు తరలించాం. వీళ్ల గురించి ఎంక్వైరీ చేసినప్పుడు చాలా ఆసుపత్రులను ఇలాగే బెదిరించారని తెలిసింది." - శ్రీరామ్, ఆదోని ఒకటో పట్టణ సీఐ
క్యాన్సర్ ఉందని ఎమోషనల్ బ్లాక్‌మెయిల్- విద్యార్థినిపై అసిస్టెంట్ ప్రొఫెసర్ అత్యాచారం
Pub G గేమ్‌లో పరిచయం.. ఆల్కహాల్ తాగించి రేప్.. ఆపై న్యూడ్ వీడియోలతో బ్లాక్ మెయిల్