ETV Bharat / spiritual

జాతకంలో గ్రహబలం తక్కువగా ఉందా? - కార్తికంలో నవగ్రహాలకు ఇలా ప్రదక్షిణలు చేస్తే శుభమట!

కార్తికమాసంలో నవగ్రహాలకు ప్రదక్షిణలు మంచిదట -ఇలా ప్రదక్షిణలు చేస్తే అంతా మంచి జరుగుతుంది!

Karthika Masam Navagraha Puja 2024
Karthika Masam Navagraha Puja 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : 5 hours ago

Karthika Masam Navagraha Puja 2024 : కార్తిక మాసంలో నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందవచ్చని జ్యోతిష్య నిపుణులు చెబుతుంటారు. అయితే, నవగ్రహ దోషాలు పోవడానికి, నవగ్రహాలను ప్రసన్నం చేసుకోవడానికి.. ఒక్కొక్క గ్రహానికి ప్రత్యేకమైన సంఖ్యలో ప్రదక్షిణలు చేయాలని ప్రముఖ జ్యోతిష్యుడు మాచిరాజు కిరణ్​ కుమార్​ చెబుతున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం..

సూర్యుడి బలం లేనివారు : జాతకంలో సూర్యుడి బలం లేకపోతే.. ఉద్యోగంలో ప్రమోషన్లు ఆలస్యమవుతాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తులు ఆలస్యమవుతాయి. కాబట్టి, జాతకంలో సూర్యుడి బలం లేనివారు ఈ కార్తికంలో నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయాలి. 'ఓం ఆదిత్యాయ నమః' అని చదువుకుంటూ 6 ప్రదక్షిణలు చేయండి. ఎందుకంటే జాతకంలో సూర్యుడి దశ ఆరు సంవత్సరాలుంటుంది.

జాతకంలో చంద్రుడి బలం తక్కువగా ఉంటే : జాతకంలో చంద్రుడి బలం తక్కువగా ఉన్నట్లయితే.. ప్రశాంతత ఉండదు. ముఖ్యంగా సాఫ్ట్​వేర్​ రంగంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాగే తల్లివైపు నుంచి ఆస్తులు రావడం ఆలస్యమవుతుంది. ఇలాంటి వారు చంద్రుడికి సంబంధించిన 'సోం సోమాయ నమః' అనే మంత్రం చదువుకుంటూ 16 ప్రదక్షిణలు చేయాలి. 16 ప్రదక్షిణలే ఎందుకంటే.. జాతకంలో చంద్ర మహాదశ 10 సంవత్సరాలుంటుంది. సూర్యుడి దశ 6 సంవత్సరాలుంటుంది. అయితే, ఏ గ్రహానికి ప్రదక్షిణలు చేస్తున్నా సరే.. సూర్యుడికి సంబంధించిన ప్రదక్షిణలు కూడా కలుపుకుని చేయాలి. ఇలా చేస్తేనే ఆ గ్రహం సంపూర్ణమైన శక్తి లభిస్తుంది.

జాతకంలో కుజుడి బలం తక్కువగా ఉంటే : జాతకంలో కుజుడి బలం తక్కువగా ఉన్నవారికి అప్పులు ఎక్కువవుతాయి. గృహయోగం ఆలస్యమవుతుంది. రియల్​ ఎస్టేట్​లో ఇబ్బందులు ఉంటాయి. కుటుంబంలో ఇబ్బందులు కలుగుతాయి. రుణాలు త్వరగా లభించవు. అలాంటప్పుడు కార్తికంలో నవగ్రహ ప్రదక్షిణలు చేస్తే మంచి జరుగుతుంది. కుజ దశ జాతకంలో 7 సంవత్సరాలుంటుంది. రవి దశ 6 సంవత్సరాలు కలుపుకుని.. 13 ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు చేసేటప్పుడు 'ఓం అం అంగారకాయ నమః' అనే మంత్రం జపించాలి.

జాతకంలో బుధుడి బలం తక్కువగా ఉంటే : జాతకంలో బుధుడి బలం తక్కువగా ఉన్నట్లయితే.. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో సమస్యలు వస్తుంటాయి. ఈ మూడు రంగాల్లో అనుకూలత రావాలంటే.. బుధ గ్రహం అనుగ్రహం కోసం కార్తికంలో ప్రదక్షిణలు చేయాలి. బుధుడి దశ జాతకంలో 17 సంవత్సరాలుంటుంది. సూర్యుడి దశ 6 సంవత్సరాలు కలుపుకుని.. 23 ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు చేసే సమయంలో 'బుం బుధాయ నమః' అనే మంత్రం జపించాలి.

జాతకంలో గురువు బలం లేకపోతే : జాతకంలో గురువు బలం తక్కువగా ఉంటే.. బంగారాన్ని కొనుక్కునే యోగం ఉండదు. సివిల్​, క్రిమినల్​ కేసుల్లో ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతుంటారు. వివాహ సమస్యలుంటాయి. సమాజంలో విలువ ఉండదు. ఇలాంటి వారు ఇబ్బందుల నుంచి బయట పడడానికి గురు గ్రహాన్ని ప్రసన్నం చేసుకోవాలి. జాతకంలో గురు దశ 16 సంవత్సరాలుంటుంది. సూర్యుడి దశ 6 కలుపుకుని.. 22 ప్రదక్షిణలు చేయాలి. ఈ సమయంలో గురువుకు సంబంధించిన 'బృం బృహస్పతయే నమః' అనే మంత్రం చదువుకోవాలి.

జాతకంలో శుక్రుడి బలం తక్కువగా ఉంటే : శుక్రుడి బలం తక్కువగా ఉంటే.. సినిమా, టీవీ రంగాల్లో విజయం సాధించలేరు. సంగీతం, నాట్య రంగాల్లోనూ విజయం వరించదు. భార్యభర్తల మధ్య గొడవలు వస్తుంటాయి. డబ్బు నిలబడదు. అలాంటప్పుడు శుక్రుడి బలం కావాలి. జాతకంలో శుక్ర మహాదశ 20 సంవత్సరాలుంటుంది. సూర్యుడి దశ 6 సంవత్సరాలు కలుపుకుని.. 26 ప్రదక్షిణలు నవగ్రహాలకు చేయాలి. ప్రదక్షిణలు చేసేటప్పుడు 'ఓం గం శుక్రాయ నమః' అనే మంత్రం చదువుకోవాలి.

శని బలం లేకపోతే : శని బలం తక్కువగా ఉంటే.. కష్టం ఎక్కువ ఫలితం తక్కువ. జాతకంలో శని దశ 19 సంవత్సరాలుంటుంది. సూర్యుడి దశ 6 సంవత్సరాలు కలుపుకుని.. 25 ప్రదక్షిణలు నవగ్రహాల చుట్టూ చేయాలి. ప్రదక్షిణలు చేసేటప్పుడు 'ఓం శం శనేశ్వరాయ నమః' అనే మంత్రం పఠించాలి. ఇలా చేస్తే శని అనుగ్రహం కలుగుతుంది.

జాతకంలో రాహు బలం : రాహు బలం తక్కువగా ఉంటే విదేశాలకు వెళ్లలేరు. అలాగే స్నేహితులను నమ్మి మోసపోతారు. ఈ ఇబ్బందులు తొలగిపోవాలంటే.. నవగ్రహాల్లో రాహు అనుగ్రహం కోసం ప్రదక్షిణలు చేయాలి. జాతకంలో రాహు దశ 18 సంవత్సరాలుంటుంది. కాబట్టి, సూర్యుడి దశ 6 సంవత్సరాలు కలుపుకుని.. 24 ప్రదక్షిణలు నవగ్రహాలకు చేయాలి. ప్రదక్షిణలు చేసేటప్పుడు 'ఓం ఐం రాహవే నమః' అనే మంత్రం పఠించాలి.

కేతువు బలం తక్కువగా ఉంటే : జాతకంలో కేతువు బలం తక్కువగా ఉన్నట్లయితే.. ఆకస్మికంగా, హఠాత్తుగా సమస్యలు వస్తాయి. ఇంట్లోని పెద్దవారికి అనారోగ్య సమస్యలు వస్తాయి. అనుకున్న పని ఆలస్యమవుతుంది. అలాంటప్పుడు కేతువు అనుగ్రహం కోసం నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయాలి. జాతకంలో కేతు మహాదశ 7 సంవత్సరాలుంటుంది. కాబట్టి, రవి దశ 6 సంవత్సరాలు కలుపుకుని.. 13 ప్రదక్షిణలు నవగ్రహాలకు చేయాలి. ప్రదక్షిణలు చేసేటప్పుడు 'ఓం కం కేతవే నమః' అనే మంత్రం పఠించాలి. ఇలా కార్తిక మాసంలో ప్రతి గ్రహం అనుగ్రహం పొందడానికి ప్రత్యేక సంఖ్యలో ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేస్తే అన్ని సమస్యలు దూరమైపోతాయని మాచిరాజు కిరణ్​ కుమార్​ చెబుతున్నారు.

ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు జ్యోతిష్యులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

కార్తిక మాసంలో నదీ స్నానం చేస్తే - ఎంత గొప్ప ఫలితం లభిస్తుందో మీకు తెలుసా?

కార్తిక శనివారం "వేంకటేశ్వర శంఖుచక్రదీపం" వెలిగిస్తే చాలు - కలి దోషాలు, పీడలు, బాధలన్నీ ఇట్టే తొలగిపోతాయట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.