ETV Bharat / state

శ్రీశైలం సిగలో మరో ఐకానిక్‌ వంతెన - పర్యాటకుల మనసు దోచేలే ప్రయాణం

తెలంగాణ సరిహద్దులో కృష్ణా నదిపై ప్రతిపాదిత వంతెన ఎలైన్‌మెంట్‌- కార్యరూపం దాలిస్తే 9 కి.మీ. తగ్గనున్న దూరం

iconic_bridge_on_krishna_river_in_srisailam
iconic_bridge_on_krishna_river_in_srisailam (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 23, 2024, 7:26 AM IST

Iconic Bridge on krishna River in Srisailam : హైదరాబాద్‌-శ్రీశైలం-నంద్యాల జాతీయ రహదారి ఎన్నెన్నో అందాలకు నెలవు. పూర్తిగా నల్లమల అడవి మీదుగా సాగే ఈ మార్గంలో ప్రయాణిస్తుంటే పెద్ద పులుల అభయారణ్యాలు మధ్యలో కృష్ణా నది దానికిరువైపులా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల సరిహద్దులో ఘాట్‌రోడ్లు. అద్భుతమైన శ్రీశైలం డ్యాం అటువైపు ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం. మరో వైపు ఆక్టోపస్, ఫర్హాబాద్‌ వ్యూపాయింట్లు, టైగర్‌ సఫారీ, సలేశ్వరం, ఉమామహేశ్వర ఆలయాలు పర్యాటకుల మనసు దోస్తాయి. ఈ జాబితాలో ఐకానిక్‌ వంతెన సైతం చేరనుంది.

ప్రకృతి పర్యాటక ఆకర్షణ హైదరాబాద్‌-శ్రీశైలం జాతీయ : రహదారిపై పెరుగుతున్న వాహనాల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ మార్గాన్ని విస్తరించేందుకు జాతీయ రహదారుల సంస్థ కసరత్తు చేస్తోంది. ఈ విస్తరణంలో భాగంగా తెలంగాణలోని మన్ననూరు నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం వరకు చేపట్టే ప్రతిపాదిత నాలుగు వరుసల ఎలివేటెడ్‌ కారిడార్‌లో కృష్ణా నది ప్రాంతం కీలకం కానుంది. ఆనకట్ట దిగువన నదిని దాటేచోట నాలుగు వరుసలతో ఐకానిక్‌ బ్రిడ్జిని నిర్మించేందుకు డిజైన్‌ రూపొందించారు. ఈ ప్రణాళిక కార్యరూపం దాలిస్తే శ్రీశైలానికి తొమ్మిది కిలోమీటర్ల దూరం తగ్గే అవకాశముంది.

670 మీటర్ల మేర ఐకానిక్‌ వంతెన : శ్రీశైలం వెళ్లే ప్రస్తుత రోడ్డు మార్గంలో ఈగలపెంట మీదుగా పాతాలగంగ దాటాక కృష్ణా నదిపై వంతెన ఉంది. దాన్ని దాటితే ఆంధ్రప్రదేశ్‌ పరిధి. అయితే నదికి ఇరువైపులా ఎత్తైన కొండల పైనుంచి కింది వరకు అనేక మలుపులతో ఘాట్‌ రోడ్డు ఉంటుంది. నది దాటి ఏపీలో ప్రవేశించాక మళ్లీ ఘాట్‌ రోడ్డు మలుపులు తిరుగుతూ కొండపైకి చేరుతుంది. ఈ మార్గంలో అధిక దూరం, సమయం ప్రయాణించాల్సి వస్తుంది.

ఈ ప్రయాసలను తప్పించేలా కృష్ణా నదిపై ఐకానిక్‌ వంతెన నిర్మాణాన్ని ప్రతిపాదించారు. నదిపై ప్రస్తుత రోడ్డుకు, శ్రీశైలం డ్యాంకు మధ్యలో వంతెన ఎలైన్‌మెంట్‌ను ఖరారు చేశారు. కృష్ణా మీదున్న ప్రస్తుత రోడ్డును విస్తరించకుండా ‘బైపాస్‌’గా కొత్తమార్గాన్ని డిజైన్‌ చేశారు. ఈ వంతెన గరిష్ఠ ఎత్తు 173 మీటర్లు ఉంటుంది. నది మీదుగా సాగే ఎలివేటెడ్‌ కారిడార్‌ సున్నిపెంట అవతలి వరకు దాదాపు శ్రీశైలం వరకు సాగుతుంది.

నాగార్జునసాగర్​-శ్రీశైలం బోటు షికారు ప్రారంభం - ప్యాకేజి వివరాలివే

కిలోమీటర్‌కు రూ.115 కోట్ల ఖర్చు : హైదరాబాద్‌-శ్రీశైలం జాతీయ రహదారి విస్తరణ ప్రాజెక్టు పొడవు 62.5 కి.మీ. ఇందులో 56.2 కి.మీ. అటవీమార్గం. 6.3 కి.మీ. అటవీయేతర ప్రాంతం. మొత్తంగా 47.82 కి.మీ. పొడవున ఎలివేటెడ్‌ కారిడార్‌ (ఫ్లై ఓవర్‌)గా నిర్మించనున్నారు. ఈ ఫ్లై ఓవర్‌ నిర్మాణానికి (ఎక్కి, దిగే ర్యాంపులతో కలిపి) ప్రతి కి.మీ.కు రూ.115 కోట్ల చొప్పున ఖర్చవుతుందని అంచనా వేశారు.

ప్రస్తుతం రోజుకు 7,759 వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఆ సంఖ్య 2027 సంవత్సరానికి 10,100కు, 2040 నాటికి 26,580కి చేరుతుందని ట్రాఫిక్‌ అధ్యయనంలో తేలింది. హైదరాబాద్‌-శ్రీశైలం నాలుగు వరుసల కారిడార్‌ ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం రూ.7,688 కోట్లు. కేంద్ర అటవీ శాఖ అనుమతుల కోసం ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ప్రయత్నిస్తున్నారు.

ఎత్తెంత.. దూరమెంత?
గరిష్ఠ ఎత్తు173 మీటర్లు
ఐకానిక్‌ వంతెన మొత్తం మార్గం1,190 మీటర్లు
నదిపై ప్రధాన బ్రిడ్జి పొడవు670 మీటర్లు
తెలంగాణ వైపు వయడక్ట్‌180 మీటర్లు
ఆంధ్రప్రదేశ్‌ వైపు వయడక్ట్‌340 మీటర్లు

మల్లన్న దారిలో మనసు దోచే భారీ నిర్మాణం - ప్రకృతి ఒడిలో 'పైదారి'లో ప్రయాణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.