TTD Appealed to Devotees Coming for Tirumala Darshan: తిరుమల శ్రీవారి దర్శనం విషయంలో టీటీడీ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. టోకెన్లు, టికెట్లు పొందిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లలోకి ప్రవేశించాలని విజ్ఞప్తి చేసింది. ఇదే విషయాన్ని పలుమార్లు ప్రచార, ప్రసార మాధ్యమాల ద్వారా భక్తులకు తెలియజేసినట్లు అధికారులు తెలిపారు. ఇటీవల కొందరు భక్తులు వారికి కేటాయించిన సమయం కంటే ముందే వచ్చి క్యూలైన్లలోకి అనుమతించాలని టీటీడీ సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారని వెల్లడించింది. అంతేకాకుండా సోషల్ మీడియాలోనూ అసత్య ప్రచారం చేస్తున్నారని ఇది సరైన పద్ధతి కాదు ప్రకటనలో టీటీడీ పేర్కొంది.
వైభవంగా గరుడసేవ: తిరుమలలో గరుడసేవను టీటీడీ వైభవంగా నిర్వహించింది. పౌర్ణమి సందర్భంగా సర్వాలంకార భూషితుడైన మలయప్పస్వామి గరుడ వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. పెద్ద ఎత్తున భక్తులు గ్యాలరీల్లోకి చేరుకొని స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు. ఆలయ మాడవీధులు గోవింద నామస్మరణతో మారుమోగాయి.
తిరుమల కల్తీ నెయ్యి సరఫరా కేసు - సిట్ రిమాండ్ రిపోర్టులో కీలకాంశాలు
తిరుమలలో చెత్త సమస్యకు చెక్ - వ్యర్థాల తొలగింపు పనులు వేగవంతం