Police File Petition on Vijayawada Court: వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని 10 రోజుల కస్టడీ కోరుతూ పటమట పోలీసులు విజయవాడ 4వ ఏసీఎంఎం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వంశీ ఫోన్ సీజ్ చేసేందుకు అనుమతినివ్వాలని పోలీసులు పిటిషన్లో కోరారు .పిటీషన్‌పై సోమవారం విచారణ జరగనుంది. గన్నవరం టీడీపీ కార్యాలయంలో డీటీపీ ఆపరేటర్ గా పనిచేసిన సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసిన కేసులో వంశీ ఏ1 నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో అరెస్టై ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అదే సమయంలో సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మరో ఇద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వంశీబాబు, గంటా వీర్రాజులను పటమట పోలీసులు అరెస్ట్ చేశారు. వంశీబాబు కారును సీజ్ చేశారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఇప్పటివరకు ఐదుగురు అరెస్ట్ అయ్యారు.
వల్లభనేని వంశీ అరెస్టుపై స్పందించిన హోం మంత్రి - ఏమన్నారంటే?
తన కోసం కష్టపడిన వారిపైనే అక్రమ కేసులు - ఐదేళ్లలో వంశీ అరాచకాలు ఇవీ!