ETV Bharat / state

దారుణం - కన్న కుమారుడినే ముక్కలు ముక్కలుగా నరికి చంపిన తల్లి, ఆపై ఏం చేశారంటే? - MOTHER KILLED HER OWN SON

ముక్కలుగా నరికిన శరీర భాగాలను మూడు గోనెసంచుల్లో కుక్కి పంట కాలువలో పడేశారు - పెద్ద కుమారుడు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు

Mother Murdered Her Own Son By Cutting Him into Pieces
Mother Murdered Her Own Son By Cutting Him into Pieces (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 14, 2025, 10:35 PM IST

Mother Murdered Son by Cutting Him into Pieces: హైదరాబాద్‌లోని మీర్ పేట్‌లో భార్యను ముక్కలుగా నరికి హత్య చేసిన దారుణ ఘటన మరువక ముందే ప్రకాశం జిల్లాలో అలాంటి దారుణమే మరొకటి వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని తెలుగు వీధిలో 35 ఏళ్ల కన్న కుమారుడు శ్యామ్​ను కన్నతల్లి సాలమ్మ ఓ ఆటో డ్రైవర్ మోహన్ తో కలిసి హత్య చేయించింది. తరువాత శరీర భాగాలను ముక్కలుగా నరికి మూడు గోనెసంచుల్లో కుక్కి మేదర బజారు సమీపంలోని పంట కాలువలో పడేశారు. తర్వాత ఏమీ జరగనట్లు ప్రశాంతంగా ఉండిపోయారు.

మూడు గోనెసంచుల్లో శరీర భాగాలు: అనంతరం సాలమ్మ పెద్ద కుమారుడు సుబ్రమణ్యం ఫిర్యాదుతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తన తమ్ముడిని ఆస్తికోసం తన తల్లి సాలమ్మ, ఆటో డ్రైవర్ మోహన్​తో కలిసి హత్య చేసినట్లుగా పోలీసులకు చెప్పారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు శరీర భాగాలు పడేసిన ప్రాంతానికి వెళ్లి మూడు గోనెసంచుల్లో ఉన్న శరీర భాగాలను గుర్తించారు. అనంతరం తల్లి సాలమ్మ, ఆటో డ్రైవర్ మోహన్​తో పాటు శ్యామ్ పెద్దన్న అయినా సుబ్రహ్మణ్యాన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నిందితులు చెబుతున్న కారణాలు పొంతన లేకపోవడంతో విచారణ చేపట్టారు. ఆస్తి తగాదాల నేపథ్యంలోనే హత్య జరిగినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు.

వివాహేతర సంబంధం అనుమానంతో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ హత్య

'నీకు నీ భర్త బాధ వదిలింది' - మర్డర్ చేసి ప్రియురాలికి ప్రియుడి ఫోన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.