Government Seized Agrigold Assets: అగ్రిగోల్డ్‌కు చెందిన వందల కోట్ల విలువైన ఆస్తులను ప్రభుత్వం జప్తు చేసింది. తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, కర్ణాటకలోని స్థలాలు, భూములను స్వాధీనం చేసుకుంది. అలాగే అగ్రిగోల్డ్ అనుబంధ సంస్థలకు చెందిన 227 కోట్ల విలువైన ప్లాంట్లు, యంత్రాలు, కార్యాలయ సామగ్రిని ప్రభుత్వం జప్తు చేసింది.
అగ్రిగోల్డ్ ఆస్తులను సీజ్ చేసిన ప్రభుత్వం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తోపాటు తమిళనాడు, కర్ణాటకలో వివిధ ఆకర్షణీయ పథకాల పేరిట 32 లక్షల మంది నుంచి వేలకోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన అగ్రిగోల్డ్ సంస్థకు చెందిన వందలకోట్ల విలువైన ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం జప్తు చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకలోని లక్షా 73 వేల 662 చదరపు గజాల స్థలాలతోపాటు 368 ఎకరాల భూమిని ప్రభుత్వం జప్తు చేసింది. వీటితోపాటు అనుబంధ సంస్థలకు చెందిన 227 కోట్ల విలువైన ప్లాంట్లు, యంత్రాలు, ఆ కార్యాలయాల్లోని పరికరాలు, ఫర్నీచర్ జప్తు చేసింది. వీటితోపాటు 17 కంపెనీల్లో 20 లక్షల విలువైన షేర్లు జప్తు చేసింది. కర్ణాటక, తమిళనాడు, ఏపీ, తెలంగాణలో కలిపి 153 స్థిరాస్తులను జప్తు చేశారు. వీటితోపాటు విశాఖ, విజయవాడ, హైదరాబాద్‌లాంటి నగరాల్లో కొన్ని ఆస్తులు ఉండటం గమనార్హం.
అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో మరో మలుపు - ఫోర్జరీ కోణం గుర్తించిన ఏసీబీ - Agri gold Land Issue
Agri Gold and Akshaya Gold cases: అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్ కేసుల్లో కీలక మలుపు