ETV Bharat / state

'విగ్రహాల్లో జీవకళ ఉట్టిపడుతోంది' - కాటూరి ఆర్ట్ గ్యాలరీని సందర్శించిన శైలజా కిరణ్ - SHAILAJA KIRON VISIT KATURI GALLERY

కాటూరి ఆర్ట్ గ్యాలరీని సందర్శించిన మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ - రెండేళ్ల క్రితం మరణించిన తన తండ్రి సుందరనాయుడు విగ్రహం పరిశీలన

Shailaja Kiron Visits Katuri Art Gallery
Shailaja Kiron Visits Katuri Art Gallery (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 15, 2025, 5:29 PM IST

Margadarsi MD Shailaja Kiron Visits Katuri Art Gallery: ఇనుము, ప్లాస్టిక్ వంటి వ్యర్థాలను పునర్వియోగించే పరిశ్రమలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ అన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలోని కాటూరి ఆర్ట్ గ్యాలరీని ఆమె సందర్శించారు. 2 సంవత్సరాల క్రితం కన్నుమూసిన తన తండ్రి సుందరనాయుడు విగ్రహం తెనాలి కాటూరి శిల్పశాలలో తయారవుతోంది. విగ్రహం తుదిరూపును పరిశీలించి కొన్ని మార్పులు చేర్పులు సూచించారు. విగ్రహం చాలా బాగా తయారైందని శిల్పులను అభినందించారు. ఆర్ట్ గ్యాలరీలోని విగ్రహాలను తిలకించారు.

అనంతరం వార్తశృంగ పేరుతో కాటూరి శిల్పులు రూపొందించిన ఆధునిక తరహా శిల్పాన్ని శైలజా కిరణ్ ఆవిష్కరించారు. శిల్ప కళలో 3D పరిజ్ఞానాన్ని వినియోగించి ఈ శిల్పాన్ని రూపొందించారు. సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఆధునిక ఆలోచనలతో విగ్రహాలు, శిల్పాలు రూపొందిస్తున్న కాటూరి కుటుంబ సభ్యులను అభినందించారు. కాటూరి ఆర్ట్ గ్యాలరీలోని విగ్రహాల్లో జీవకళ ఉట్టిపడుతోందని శైలజా కిరణ్ ప్రశంసించారు.

తెనాలికి ఉన్న పేరును నిలబెట్టేందుకు ఇక్కడి కళాకారులు కృషి చేస్తున్నారని శైలజా కిరణ్ అభిప్రాయపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా శిల్ప కళలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకుని వార్తశృంగ శిల్పాన్ని రూపొందించినట్లు శిల్పి శ్రీహర్ష తెలిపారు. తమ ఆర్ట్‌ గ్యాలరీని శైలజా కిరణ్ వంటి ప్రముఖులు సందర్శించడం సంతోషంగా ఉందన్నారు.

"మా నాన్న డాక్టర్ సుందరనాయుడు రెండున్నర సంవత్సరాల క్రితం మనకు దూరమయ్యారు. ఆయన జ్ఞాపకార్థంగా విగ్రహం తయారు చేయమని కాటూరి వెంకటేశ్వరరావుకి చెప్పడం జరిగింది. దాదాపు 90 శాతం దగ్గరగా వచ్చింది. అది చాలా మంచిగా వచ్చినట్టు. కాటూరి ఆర్ట్ గ్యాలరీ అంతా చూశాను. ఇక్కడ ఏఐ టెక్నాలజీ ఉపయోగించి శిల్పాలలో కొత్తదనం ఉండాలి అని కొత్తగా తయారు చేస్తున్నారు. ఇందులో మెటల్ వర్క్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంత భారీ సైజులో మెటల్ వర్క్స్ చూడటం చాలా అరుదు. పారిస్​ని ఇక్కడకి తీసుకొచ్చినట్లుగా ఉంది. ఈ మెటల్ వర్క్స్​తో తెనాలికే అందం తీసుకొచ్చారు. వీటిని వేస్ట్ మెటీరియల్స్​తో తయారు చేశారు. - శైలజా కిరణ్, మార్గదర్శి మేనేజింగ్ డైరెక్టర్

మేమంతా శుభోదయం అనే పలకరించుకుంటాం - వారి వల్లే తెలుగుకు ప్రాచుర్యం : శైలజా కిరణ్‌

కోడళ్లు అనుకోలేదు.. కూతుళ్లుగానే భావించారు - రామోజీరావు కోడలు శైలజా కిరణ్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.