ETV Bharat / offbeat

నిమిషాల్లో మెత్తని "సగ్గుబియ్యం దోశలు" - ఇలా చేస్తే నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి! - SABUDANA DOSA RECIPE

సూపర్ టేస్టీ సగ్గుబియ్యం దోశలు -అప్పటికప్పుడు ఇలా చేసుకోండి!

Sabudana Dosa Recipe in Telugu
Sabudana Dosa Recipe in Telugu (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 16, 2025, 2:30 PM IST

Sabudana Dosa Recipe in Telugu : చాలా మంది బ్రేక్​ఫాస్ట్​లో దోశ ఇష్టంగా తింటారు. అందుకే ఎక్కువమంది మహిళలు వారానికి సరిపడా దోశ పిండి ఫ్రిడ్జ్​లో నిల్వ పెట్టుకుంటుంటారు. అయితే, దోశలు ఎప్పుడూ బియ్యం, మినప్పప్పు మిశ్రమంతోనే కాకుండా ఓ సారి సగ్గుబియ్యంతో ట్రై చేయండి. ఈ దోశలు మృదువుగా ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పైగా ఈ సగ్గుబియ్యం దోశలు చేయడానికి పిండిని రాత్రంతా పులియబెట్టాల్సిన పనిలేదు. అప్పటికప్పుడు చేసుకోవచ్చు! మరి ఇక ఆలస్యం చేయకుండా సూపర్ సాఫ్ట్​ సగ్గుబియ్యం దోశలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అందుకు కావాల్సిన పదార్థాలేంటి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • సగ్గుబియ్యం - 1 కప్పు
  • బియ్యం - 1 కప్పు
  • పెరుగు - పావు కప్పు
  • నూనె - తగినంత
  • అల్లం - అంగుళం ముక్క
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
  • పచ్చిమిర్చి - 4
  • ఉల్లిపాయ - 1
  • ఉప్పు - రుచికి సరిపడా
  • కరివేపాకు - 2 రెమ్మలు(సన్నగా తరుక్కోవాలి)

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా వేర్వేరు గిన్నెల​లో బియ్యం, సగ్గుబియ్యాన్ని విడివిడిగా మూడు గంటలపాటు నానబెట్టుకోవాలి.
  • అలాగే దోశల పిండిలో కావాల్సిన ఉల్లిపాయ, పచ్చిమిర్చిని సన్నగా తరుక్కొని పక్కన ఉంచుకోవాలి.
  • అనంతరం మిక్సీ జార్ తీసుకొని అందులో సగ్గుబియ్యం వేసుకుని కొన్ని నీళ్లు యాడ్​ చేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
  • ఈ మిశ్రమాన్ని ఒక మిక్సింగ్​ బౌల్లోకి తీసుకోండి. ఆపై బియ్యం కూడా మిక్సీ గిన్నెలో వేసుకుని మెత్తగా గ్రైండ్​ చేసుకోండి. అనంతరం పిండిని మిక్సింగ్​ బౌల్లో కలుపుకోండి.
  • అనంతరం మరో మిక్సీ జార్​లో సన్నగా తరుకున్న పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసి మెత్తని పేస్ట్​లా గ్రైండ్ చేసుకోవాలి.
  • తర్వాత మిక్సింగ్​ బౌల్లోకి తీసుకున్న పిండిలోకి పచ్చిమిర్చి పేస్ట్​ని వేసుకొని మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి.
  • ఇప్పుడు అందులో పెరుగు, సన్నగా తరుకున్న కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ తరుగు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అన్నీ కలిసేలా చక్కగా మిక్స్ చేసుకోవాలి.
  • పిండి మరీ పలుచగా, చిక్కగా కాకుండా దోశల పిండిలా ఉండే విధంగా పిండిలో నీళ్లు పోసి కలుపుకోండి.
  • ఇప్పుడు స్టవ్​పై దోశ పెనం పెట్టుకొని వేడి చేసుకోవాలి. పాన్ వేడయ్యాక కొద్దిగా ఆయిల్​ వేసి, పిండిని తీసుకొని దోశ మాదిరిగా వేసుకోవాలి.
  • ఇక్కడ ఈ పిండిని నార్మల్ దోశ వేసుకున్నట్లు గట్టిగా రుద్దకూడదని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇవి కాస్త మందంగానే వస్తాయి.
  • దోశ కొద్దిగా కాలాక అంచుల వెంబడి కాస్త నూనె వేసుకోవాలి. తర్వాత మీడియం ఫ్లేమ్ మీద రెండు వైపులా ఎర్రగా కాల్చుకుని దోశలను సర్వ్ చేసుకోవాలి.
  • మిగిలిన పిండితో ఇలా సగ్గుబియ్యం దోశలు చేసుకుంటే టేస్టీగా ఉండే "సగ్గుబియ్యం దోశలు" రెడీ!
  • ఈ దోశలు అల్లం చట్నీతో ఎంతో బాగుంటాయి.
  • సగ్గుబియ్యం దోశలు నచ్చితే మీరు ఓ సారి ఇంట్లో ట్రై చేయండి.

ఇడ్లీ పాత్రలో "వడలు" - చుక్క నూనె అవసరం లేదు - టేస్ట్​ అదుర్స్​!

'ఆహా!' అనిపించే కమ్మటి "రాగి ఉప్మా" - ఒక్కసారి తింటే మళ్లీ చేసుకోవడం పక్కా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.