Brain Dead Woman organ Donation: కన్ను తెరిస్తే జననం కన్ను మూస్తే మరణం. పుట్టడం, గిట్టడం ఏ ఒక్కరి చేతిలో ఉండేవి కావు. కానీ మరణశయ్యపై ఉంటూ మరో నలుగురికి అవయవాలను ప్రసాదించడం ఒక గొప్ప కార్యంగా చెప్పవచ్చు. ఇది గ్రహించిన కొందరు తమ వారు మరణించినా పరుల మేలు ఆలోచించి పునర్జన్మను ప్రసాదిస్తున్నారు.
అసలేమైందంటే? గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రిలో తొలిసారి అవయవ దానం చేశారు. విజయవాడకు చెందిన 54 సంవత్సరాల సరస్వతి ఈనెల 14న రహదారి ప్రమాదానికి గురయ్యారు. సరస్వతిని మంగళగిరిలోని ఎయిమ్స్ తరలించారు. ఆమె బ్రెయిన్‌డెడ్‌కు గురైనట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆస్పత్రి వైద్యుల సూచన మేరకు సరస్వతి అవయవాలు దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. కాలేయం, కిడ్నిని మణిపాల్ ఆసుపత్రికి, కళ్లను ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి, మరో కిడ్నీని ఎయిమ్స్‌కు తరలించారు. సరస్వతి మృతదేహానికి ఎయిమ్స్ వైద్యులు ఘనంగా నివాళులు అర్పించారు. తెనాలి సబ్ కలెక్టర్ సంజన సిన్హా పూలమాలవేసి అంజలి ఘటించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అవయవ దానం చేసిన వారికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు సబ్ కలెక్టర్ వెల్లడించారు.
''వైద్యులు, ప్రభుత్వ కమిటీ నిర్దారించిన తర్వాత బ్రెయిన్‌డెడ్‌కి గురైనట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. కిడ్నిని మణిపాల్ ఆసుపత్రికి, కళ్లను ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి, మరో కిడ్నీని ఎయిమ్స్‌కు తరలించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అవయవ దానం చేసిన వారికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నాం'' -సంజన సిన్హా, సబ్ కలెక్టర్ తెనాలి
తాను కానరాని లోకాలకు వెళ్లి - ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపిన బాలుడు