ETV Bharat / state

నెయ్యి కల్తీ కథేంటీ - నిందితులపై ప్రశ్నల వర్షం కురిపించిన సిట్‌ - TIRUMALA ADULTERATION GHEE CASE

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో తొలిరోజు సుదీర్ఘంగా సిట్‌ విచారణ - టీటీడీకి నెయ్యి సరఫరా టెండర్లు దక్కడం వెనుక కారణాలపై ఆరా

Tirumala Adulteration Ghee Case
Tirumala Adulteration Ghee Case (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 15, 2025, 9:19 AM IST

Tirumala Adulteration Ghee Case : తిరుమల శ్రీవారి లడ్డూ నెయ్యి కల్తీ ఘటనలో నిందితులను తొలిరోజు సిట్‌ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. తిరుపతి సబ్‌జైలు నుంచి భోలేబాబా డెయిరీ మాజీ డైరెక్టర్లు విపిన్‌జైన్‌, పొమిల్‌జైన్​లతో పాటు శ్రీవైష్ణవి డెయిరీ సీఈవో అపూర్వ వినయకాంత్‌ చావ్డా, ఏఆర్ డెయిరీ ఎండీ డా.రాజు రాజశేఖరన్‌లను సీఐడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. రుయా ఆస్పత్రిలో వారికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అలిపిరిలోని టీటీడీ భవనంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సిట్‌ కార్యాలయానికి తరలించారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన విచారణ సాయంత్రం ఐదున్నర వరకు సాగింది. నిందితులు నలుగురిని వేర్వేరు గదుల్లో ఉంచి విచారించారు.

ఉత్తరాఖండ్, తమిళనాడులోని డెయిరీలు, నివాసాల నుంచి స్వాధీనం చేసుకున్న దస్త్రాలతోపాటు టీటీడీ ప్రొక్యూర్‌మెంట్‌ విభాగం అధికారులు, సిబ్బంది ఇచ్చిన సమాచారం ఆధారంగా తొలిరోజు నిందితులపై సిట్‌ ప్రశ్నల వర్షం కురిపించింది. భోలేబాబా డెయిరీ డైరెక్టర్లుగా రాజీనామా చేయడంతో పాటు వాహన డ్రైవర్లను డైరెక్టర్లుగా ఎందుకు నియమించాల్సి వచ్చిందన్న అంశాలపై విపిన్‌జైన్‌, పొమిల్​జైన్‌లను ప్రశ్నించారు.

SIT Inquiry Adulterated Ghee Case : డెయిరీకి పాలు ఏఏ ప్రాంతాల నుంచి సేకరిస్తారు, సేకరించిన పాల నుంచి వెన్న, నెయ్యి తయారీలో అనుసరించే విధానాలు వాటి నాణ్యతను నిర్ధారణపై ప్రశ్నించారు. 2021లో టీటీడీకి నెయ్యి సరఫరా చేసే టెండర్‌ దక్కడంలో సహకరించిన వ్యక్తులు తదితర అంశాలపై వివరాలు సేకరించారు. టీటీడీకి నెయ్యి సరఫరా చేసే స్థాయి లేకున్నా టెండర్లలో ఎందుకు పాల్గొనాల్సి వచ్చిందని ఏఆర్ డెయిరీ ఎండీ రాజశేఖరన్‌ సిట్ ప్రశ్నించినట్లు తెలిసింది.

మార్కెట్‌ ధరల కన్నా తక్కువ ధరకే నెయ్యి సరఫరా చేయాలని ఎందుకు నిర్ణయించారని అధికారులు ఆరా తీశారు. భోలేబాబా డెయిరీ నిర్వాహకులతో ఒప్పందం కుదిరిన తర్వాతనే టీటీడీ టెండర్లలో పాల్గొన్నారా అని ప్రశ్నించినట్లు తెలిసింది. ఉత్తరాఖండ్‌లో ఉన్న సిట్‌ బృందం అందించిన సమాచారం ఆధారంగా మరికొన్ని ప్రశ్నలను నిందితులపై ఇక్కడి అధికారులు సంధించారు. ఐదురోజులపాటు నిందితుల విచారణ కొనసాగనుండటంతో గత పాలకమండలిలో కీలకపాత్ర పోషించిన వ్యక్తల గుండెల్లో గుబులు మొదలైంది. విచారణలో ఏయే పేర్లు బయటకొస్తాయోనని ఆందోళన చెందుతున్నారు. అలాగే టీటీడీ ప్రొక్యూర్‌మెంట్‌ విభాగంలో పనిచేసి, అక్రమాలకు సహకరించిన ఉద్యోగుల్లోనూ అలజడి నెలకొంది.

తిరుమల కల్తీ నెయ్యి సరఫరా కేసు - సిట్ రిమాండ్ రిపోర్టులో కీలకాంశాలు

రోజూ ఎంత నెయ్యి వినియోగిస్తారు? ఎక్కడనుంచి తీసుకొస్తారు? - తిరుమలలో సిట్​ విచారణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.