ETV Bharat / entertainment

కాబోయే కోడలిపై నాగ్​ మామ ప్రశంసలు - ఇంతకీ ఆయన ఏమన్నారంటే? - NAGARJUNA ABOUT SOBHITA DHULIPALA

శోభిత ధూళిపాళ్లపై నాగార్జున ప్రశంసల జల్లు - పెళ్లి గురించి ఆయన ఏమన్నారంటే?

Nagarjuna About Sobhita Dhulipala
Sobhita Dhulipala, Nagarjuna (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 22, 2024, 11:09 AM IST

Nagarjuna About Sobhita Dhulipala : టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున తాజాగా తన కాబోయే కోడలు శోభితా ధూళిపాళ్లపై ప్రశంసల జల్లు కురిపించారు. ఆమె సినీ ప్రయాణం గురించి మాట్లాడూతూ పొగడ్తలతో ముంచెత్తారు. ఈ స్థాయికి చేరుకోవడానికి ఆమె ఎంతో కష్టపడిందని అన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో శోభిత-నాగచైతన్యల పెళ్లి జరగనుండటం తనకు ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

"గూఢచారి' సినిమా చూసి శోభితకు కాల్​ చేసి అభినందించాను. హైదరాబాద్‌ వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చి కలవమని ఇన్వైట్ చేశాను. తన సినీ జర్నీ చాలా ఇన్సైరింగ్​గా ఉంటుంది. వైజాగ్‌ నుంచి వచ్చి ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది. ఈ స్థానానికి రావడానికి తను ఎంతో కష్టపడింది. శోభిత ఓ గొప్ప నటి. ఉన్నతమైన ఆలోచనలు కలిగిన వ్యక్తి. శోభిత-నాగచైతన్యలను చూస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంది" అంటూ శోభితను పొగడ్తలతో ముంచెత్తారు. ఇక ఇదే వేదికగా చైతూ శోభిత పెళ్లి గురించి మాట్లాడారు.

'పెళ్లి పనులు వాళ్లే చూసుకుంటున్నారు'

"ఇది మా నాన్నగారి శతజయంతి సంవత్సరం. అన్నపూర్ణ స్టూడియోస్‌ నాగచైతన్య- శోభితల పెళ్లికి వేదిక కావడం నాకెంతో సంతోషంగా ఉంది. ఇది కేవలం ఓ స్టూడియో కాదు.. మా కుటుంబ వారసత్వంలో ఓ భాగం. మా నాన్నగారికి ఇష్టమైన ప్రదేశం. చైతన్య పెళ్లిని చాలా సింపుల్‌గా చేయమని కోరారు. అందుకే ఈ వేడుకకు ఫ్యామిలీ మెంబర్స్, సన్నిహితులు అలాగే సినీ ప్రముఖులు మొత్తం 300 మందిని పిలవాలని అనుకుంటున్నాం. స్టూడియోలో అందమైన సెట్‌లో వీళ్ల పెళ్లి గ్రాండ్​గా జరగనుంది. అయితే పెళ్లి పనులు కూడా వాళ్లిద్దరే చేసుకుంటామని అన్నారు. ఆ స్టూడియోలో అన్నీ వసతులు ఉన్నాయి. ఏటా అక్కడ కనీసం 10 పెళ్లిళ్లు జరుగుతుంటాయి. శోభిత తల్లిదండ్రులు సంప్రదాయబద్ధంగా తమ కుమార్తె పెళ్లి చేయాలని కోరారు. నాకు కూడా ఆ మంత్రాలు వినడం ఎంతో ఇష్టం. అవి వింటుంటే నా మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. నాగచైతన్య - శోభితల పెళ్లి సంప్రదాయమైన తెలుగు పెళ్లి కానుంది. ప్రస్తుతానికి ఈ పెళ్లి పనులు చక చకా జరుగుతున్నాయి. రిసెప్షన్‌ వివరాలు మాత్రం ఇప్పుడే చెప్పలేను" అని నాగ్ అన్నారు.

శోభితతో చైతూ క్రేజీ సెల్ఫీ- ఇన్​స్టా పోస్ట్ వైరల్

జంగిల్ సఫారీ టు లండన్ గేట్ వే - శోభితతో చై ప్రేమ చిగురించిందిలా! - Naga Chaitanya Sobhita Love Story

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.