ETV Bharat / state

వంటింట్లోనే ప్రసవం- పండంటి మగబిడ్డకు ఆయువు- తలుపు తెరిచి చూస్తే! - MOTHER AND SON DEATH IN VIJAYAWADA

'తల్లి' డిల్లిన అనుబంధం- ఇంట్లో శిశువుతో సహా ఇల్లాలి మృతి

mother_and_son_death_in_vijayawada
mother_and_son_death_in_vijayawada (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 23, 2024, 7:37 AM IST

Updated : Nov 23, 2024, 11:24 AM IST

Mother And Son Death in Vijayawada : పక్కింటి వాళ్లు రెండ్రోజులు ఊరెళ్తే ఏదే తెలియని వెలితి, అలవాటుగా అటుగా వెళ్లేవారూ లేకపోలేదు. కానీ ఈ రోజుల్లో పక్కింట్లో మనిషి రోజుల తరబడి బయటకు రాకపోయినా పట్టించుకునే వాళ్లే కరవయ్యారు.కాంక్రీట్ వనాలుగామారిన పట్టణాల్లో ఎవరి జీవితాలు వాళ్లవే అన్న ట్లుగా పరిస్థితులు మారాయి. ఆఖరికి ప్రాణాపాయ పరిస్థితులు తలెత్తినా పట్టించుకునే వారే కరవయ్యారు. విజయవాడ విద్యాధరపురంలో అలాంటి సంఘటనే జరిగింది.

అసలేం జరిగిందంటే నంద్యాలకు చెందిన చింతా నాగరాజు (30) విజయవాడ నగరంలోని విద్యాధరపురంలో ఉంటున్నారు. అతని మొదటి భార్య విజయరాణి అనారోగ్యంతో కొన్నేళ్ల కిందట మృతి చెందారు. దీంతో నాగరాజు బతుకుదెరువు నిమిత్తం 2017లో విజయవాడ వచ్చి దుర్గాఘాట్ వద్ద పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు.

ఈ క్రమంలో అక్కడే పని చేసే పొదిలి సమ్మక్క (36) పరిచయమైంది. ఆమె భర్తకు దూరంగా ఉంటోంది. దీంతో నాగరాజు, సమ్మక్క 2021లో వివాహం చేసుకొని రావిచెట్టు సెంటర్ వద్ద నివాసముంటున్నారు. ప్రస్తుతం సమ్మక్క ఎనిమిది నెలల గర్భిణి. ఈ నెల 19న ఉదయం 5 గంటలకు నాగరాజు ఇంటి నుంచి బయటకు వచ్చాడు. సమ్మక్క గుంటూరు వెళ్తానని చెప్పడంతో ఆ రోజు నుంచి నాగరాజు దుర్గాఘాట్ వద్దనే ఉంటున్నాడు. శుక్రవారం ఇంటి పక్కన ఉండే వాళ్లు నాగరాజు వద్దకు వచ్చి ఇంటి నుంచి దుర్వాసన వస్తున్నట్లు చెప్పారు.

కోతి చేష్టలకు వృద్ధ దంపతులు బలి - అసలేం జరిగిందంటే? - A Couple Died Due To Monkey

Women and Newborn Baby Died : వెంటనే ఇంటికి వెళ్లి తలుపులు తీసి చూడగా వంటగదిలో సమ్మక్క మగ బిడ్డకు జన్మనిచ్చి చనిపోయి ఉంది. శిశువు కూడా మృతి చెంది ఉంది. దీంతో భవానీపురం పోలీసులకు సమాచారం ఇవ్వగా వారొచ్చి తల్లి, బిడ్డ మృతదేహాలను శవ పంచనామా నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతి కింద పోలీసులు కేసు. నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లీబిడ్డలది సహజ మరణమా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

దుర్వాసన వస్తోందని స్థానికుల ఫిర్యాదు- ఇంట్లో చూస్తే షాక్​!

Last Updated : Nov 23, 2024, 11:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.