ETV Bharat / state

త్వరలో ప్రతి శనివారం 'నో బ్యాగ్​డే' - ఉపాధ్యాయులకు ఒకటే యాప్: మంత్రి లోకేశ్​ - NO BAG DAY PROGRAM

ప్రతి శనివారం నో బ్యాగ్ డేగా ప్రకటించాలన్న మంత్రి నారా లోకేశ్ - ఉపాధ్యాయులకు ఇకనుంచి ఒకటే యాప్ ఉంటుందని వెల్లడి

No Bag Day program
No Bag Day program (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 28, 2025, 7:46 PM IST

Minister Nara Lokesh On No Bag Day Program: ఇకపై ప్రతి శనివారం నో బ్యాగ్ డేగా ప్రకటించి విద్యార్థులకు కో కరిక్యులమ్ యాక్టివిటీస్ రూపొందించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్యలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనాలోచితంగా తీసుకువచ్చిన జీవో 117 ఉపసంహరణపై క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులు, వివిధ సంఘాల నుంచి అభిప్రాయ సేకరణ చేయాలన్నారు. తర్వాత అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని సూచించాలన్నారు.

ఉపాధ్యాయ బదిలీ చట్టంపైనా చర్చ: పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. జీవో 117 ఉపసంహరణపై ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో పాఠశాల విద్య డైరెక్టర్ నిర్వహించిన సన్నాహక సమావేశాలలో వచ్చిన అభిప్రాయాలను, సూచనలను అధికారులు మంత్రికి వివరించారు. ఆయా సూచనలను పరిగణనలోకి తీసుకుని ఏ విద్యార్థి కూడా డ్రాప్ అవుట్ అవకుండా చర్యలు చేపట్టాలని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. అతి త్వరలోనే చేపట్టబోయే ఉపాధ్యాయ బదిలీ చట్టంపైనా సమావేశంలో చర్చించారు.

ఉపాధ్యాయులకు ఇకనుంచి ఒకటే యాప్: ఈ చట్టంపై ఉపాధ్యాయులు, సంఘాల నుంచి అభిప్రాయాలను సేకరించాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఉపాధ్యాయులకు ఉపయోగపడే విధంగా పిల్లల్లో అభ్యసన సామర్థ్యాలు మెరుగుపర్చేందుకు చర్యలు చేపట్టాలని తెలిపారు. ఉపాధ్యాయులకు ఇప్పుడున్న అనేక యాప్​ల స్థానంలో ఒకటే యాప్​ను రూపొందించే కార్యక్రమాన్ని త్వరతిగతిన పూర్తి చేయాలని వెల్లడించారు. పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల వాస్తవ సంఖ్యను నిర్థారించేందుకు అపార్ ఐడీని అనుసంధానించే కార్యక్రమాన్ని పూర్తిచేయాలన్నారు.

త్వరలో ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ బ్లూప్రింట్: ప్రజాభిప్రాయ సేకరణ కోసం అతి త్వరలోనే ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ బ్లూ ప్రింట్​ను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇంటర్మీడియట్ విద్యాశాఖలో చేపట్టబోయే సంస్కరణలపైనా సమావేశంలో విపులంగా చర్చించారు. ఈ భేటీలో పాఠశాల విద్య కార్యదర్శి కోన శశిధర్, డైరెక్టర్ వి.విజయ్ రామరాజు, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీమతి కృతికా శుక్లా, సమగ్ర శిక్ష ఎస్పీడీ బి. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

హమ్మయ్యా! పుస్తకాల మోతకు స్వస్తి - ఇక అన్ని సబ్జెక్టులు కలిపి ఒకే పుస్తకం

మీకు తెలుసా? ఏకరూప దుస్తులు, బ్యాగులు మారాయ్..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.