ETV Bharat / state

శ్రీవారి భక్తులకు గుడ్​న్యూస్​- ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల

2025 ఫిబ్రవరికి సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవల టికెట్లు

ttd_released_srivari_arjitha_seva_tickets_for_february_2025
ttd_released_srivari_arjitha_seva_tickets_for_february_2025 (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 6 hours ago

TTD Released Srivari Arjitha Seva Tickets for February 2025 : భక్తుల సౌకర్యార్థం 2025 ఫిబ్రవరికి సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవల టికెట్ల కోటాను టీటీడీ గురువారం ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ఈ నెల 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం, 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్‌ దర్శనం కోటా, మధ్యాహ్నం మూడు గంటలకు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, దివ్యాంగులకు ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్ల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.

ఈ నెల 25వ తేదీ ఉదయం పది గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్ల కోటా విడుదల చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు తిరుమల, తిరుపతిలో అద్దె గదుల బుకింగ్‌ కోటాను అందుబాటులో ఉంచనున్నారు. భక్తులు https://ttdevasthanams.ap.gov.in లో నమోదు చేసుకోవాలని సూచించారు.

ఆధ్యాత్మికత ఉట్టిపడేలా నిర్మాణాలు చేస్తాం : టీటీడీ ఈవో శ్యామలరావు

విమానాశ్రయంలో శ్రీవాణి దర్శన టికెట్ల కోటా పెంపు : రేణిగుంట విమానాశ్రయంలో రోజూ జారీ చేస్తున్న శ్రీవాణి దర్శన టికెట్ల కోటాను తితిదే వంద నుంచి రెండు వందలకు పెంచింది. ఆ మేరకు తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనం వెనుక ఉన్న శ్రీవాణి టికెట్‌ కౌంటర్‌లో జారీ చేస్తున్న టికెట్ల సంఖ్యను 900 నుంచి 800కు తగ్గించింది.

ఇకపై ఆ టికెట్లు రద్దు - రెండు గంటల్లోనే శ్రీవారి సర్వదర్శనం - టీటీడీ సంచలన నిర్ణయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.