డోర్ కర్టెన్ పైపుపై ఎక్కి కోబ్రా బుసలు- ఇంట్లోకి ప్రవేశించి నాగుపాము హల్చల్ - Cobra Entered In House - COBRA ENTERED IN HOUSE
🎬 Watch Now: Feature Video
Published : Jul 21, 2024, 7:36 PM IST
Cobra Entered In House : హరియాణా ఫతేహాబాద్ జిల్లాలోని ధింగ్సారా గ్రామంలోని ఓ ఇంట్లో నాగుపాము హల్చల్ చేసింది. 8 అడుగుల ఎత్తులో ఉన్న డోర్ కర్టెన్ పైపుపైకి నాగుపాము ఎక్కింది. దాన్ని గమనించిన కుటుంబసభ్యులు హడలిపోయారు. వెంటనే స్నేక్ క్యాచర్ పవన్ జోగ్‌పాల్‌కు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ పవన్, పైపుపై నుంచి బుసలు కొడుతున్న ఆ నాగుపామును చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం దానికి ఎటువంటి హాని కలుగకుండా అడవిలో వదిలిపెట్టినట్లు తెలిపారు. సాధారణంగా పాములు నేలపై తిరుగుతాయన్న పవన్, ఆ నాగుపాము 8 అడుగుల కర్టెన్ పైపుపైకి ఎలా ఎక్కిందో తెలియడం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
వామ్మో! ఒకే ఇంట్లో 150 నాగుపాములు- అంతా హడల్!!
ఉత్తర్‌ప్రదేశ్‌లోని కుషీనగర్ జిల్లాలో ఒకే ఇంట్లో 150 పాములు కనిపించడం కలకలం రేపింది. గంగారాణి గ్రామానికి చెందిన ఫుల్బాదన్ ఇంట్లో ఈ పాములు బయటపడ్డాయి. దాదాపు 16 గంటలపాటు శ్రమించి సుశీల్ మిశ్రా అనే వ్యక్తి ఇంట్లో నుంచి పాములను సురక్షితంగా బయటకు తీశాడు. పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి