LIVE : సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశం - CM Revanth reddy press meet - CM REVANTH REDDY PRESS MEET
🎬 Watch Now: Feature Video


Published : Sep 20, 2024, 5:01 PM IST
|Updated : Sep 20, 2024, 5:10 PM IST
CM Revanth Reddy Press Meet Live : రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సమావేశం కానుంది. ఈ సమావేశం ముందు సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేబినెట్ భేటీలో మూడు విశ్వవిద్యాలయాల పేర్లను మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ మంత్రి మండలి ఆమోదం కూడా ఉండాల్సి రావడంతో చర్చించనుంది. హైడ్రాను బలోపేతం చేసే అంశంపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. హైడ్రాకు చట్టబద్ధత కల్పించడం, రెవెన్యూ, జీహెచ్ఎంసీ, పోలీసు, చిన్న నీటిపారుదల శాఖల నుంచి సిబ్బందిని కేటాయించాల్సి ఉంది. ఈ అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు అవసరమైన చట్టాన్ని తీసుకురావడం తదితర అంశాలపై కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. పంచాయతీల ఏర్పాటుపై హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరిన విషయం తెలిసిందే. దీనిపై కూడా చర్చించి నిర్ణయం తీసుకోన్నారు. వరదల పై కూడా కేబినెట్ భేటీలో నిర్ణయాలు తీసుకోనున్నారు.
Last Updated : Sep 20, 2024, 5:10 PM IST