LIVE : పాలమూరులో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన - CM REVANTH MAHABUBNAGAR TOUR LIVE - CM REVANTH MAHABUBNAGAR TOUR LIVE
🎬 Watch Now: Feature Video


Published : Jul 9, 2024, 1:40 PM IST
|Updated : Jul 9, 2024, 2:40 PM IST
CM Revanth Reddy Mahabubnagar Tour LIVE : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉమ్మడి పాలమూరులో పర్యటిస్తున్నారు. ఉమ్మడి జిల్లా సమగ్రాభివృద్ధిపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షిస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి సహా పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, విద్య, వైద్యం, పర్యాటకం, మహిళా సాధికారత సహా ఇతర అంశాలు ప్రధాన ఎజెండాగా సమీక్ష జరపుతున్నారు. సాగునీటి రంగం తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విద్య, వైద్యం, మహిళా సాధికారత, పర్యాటకం సహా ఇతర అంశాలపై అధికారులతో చర్చించారు. ఉమ్మడి జిల్లాకు జేఎన్టీయూ కళాశాలలు, పాలమూరు విశ్వవిద్యాలయం అభివృద్ధి, సర్కారీ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనజిల్లా కేంద్రంలో వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పూర్తి, పరిశ్రమల ఏర్పాటు, నల్లమల ఎకో టూరిజం, పర్యాటక హబ్‌గా పాలమూరును అభివృద్ధి చేసేందుకు అనుసరించాల్సిన ప్రణాళికలపై సీఎం అధికారులతో సమీక్షిస్తున్నారు. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకు కావాల్సిన పనులపై అధికారులకు నివేదిక సమర్పించారు. అనంతరం మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభం సహా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసారు.
Last Updated : Jul 9, 2024, 2:40 PM IST