ఆ పేరు వినగానే పులకించిపోతుంది - 'ఇంద్ర' సక్సెస్‌కు అదే కారణం : చిరంజీవి - CHIRANJEEVI INDRA MOVIE RE RELEASE - CHIRANJEEVI INDRA MOVIE RE RELEASE
🎬 Watch Now: Feature Video
Published : Aug 20, 2024, 6:34 PM IST
Chiranjeevi Indra Movie Re Release : తన చిత్రాల్లో అత్యంత సాంకేతికంగా , ఉన్నత వాణిజ్య హంగులున్న చిత్రంగా ఇంద్ర నిలిచిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఆగస్టు 22న ఆయన బర్త్‌డే సందర్భంగా రీరిలీజ్ కానున్న నేపథ్యంలో 'ఇంద్ర' మూవీ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
ఇంద్రసేనారెడ్డి పేరు వినగానే ఒళ్లు పులకించిపోతుందని, 22 ఏళ్ల తర్వాత మళ్లీ తన పుట్టినరోజున ఈ మూవీ రీరిలీజ్ కానుండటం ఎంతో సంతోషాన్ని ఇస్తుందన్నారు. ఆ రోజుల్లో 'ఇంద్ర' ఘన విజయం సాధించడానికి కథే కారణమని అన్నారు. నేటి తరం ప్రేక్షకులకు ఈ చిత్రాన్ని వెండితెరపై చూపించాలన్న నిర్మాతలు స్వప్నదత్ , ప్రియాంక దత్‌లకు మెగాస్టార్ ప్రత్యేక అభినందనలు తెలిపారు.
"ఒక్క మాటలో చెప్పాలంటే కమర్షియల్ చిత్రానికి ఓ పెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ 'ఇంద్ర'. డైరెక్టర్ బి.గోపాల్ దీన్ని ఎంతో గొప్పగా తెరకెక్కించారు. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. 22 ఏళ్ల తర్వాత ఇప్పుడు రీరిలీజ్ కావడం నాకెంతో సంతోషాన్ని ఇస్తోంది. 2002 జులై 22 'ఇంద్ర' రిలీజ్ సందర్భంగా ఎలా ఎమోషనయ్యానో ఇప్పుడు కూడా అలానే ఉన్నాను. ఈ తరం వాళ్లకు ఈ సినిమాను బిగ్ స్క్రీన్‌పై చూపించాలనే ఆలోచన వచ్చిన స్వప్నదత్, ప్రియాంక దత్‌లకు నా హృదయపూర్వక అభినందనలను తెలియజేస్తున్నాను. అందరూ ఎంజాయ్ చేయండి" అంటూ చిరు మాట్లాడారు.