పేలిన బస్సు టైర్- 8 అడుగులు గాల్లోకి ఎరిగిపడి డ్రైవర్ మృతి - అజ్మేరలో పేలిన బస్సు టైర్
🎬 Watch Now: Feature Video
Published : Feb 22, 2024, 8:26 AM IST
Bus Tire Burst In Ajmer : టైర్ పేలి ఓ బస్సు డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని అజ్మేర్ జిల్లాలో జరిగింది. రాజ్మాడీ ట్రావెల్ బస్సు సూరత్ నుంచి వస్తుండగా టైర్ పంచర్ అయింది. డ్రైవర్ పర్బత్సర్ రోడ్‌లోని గుజరాతీ హోటర్ దగ్గర పంచర్ వేసేందుకు బస్సును ఆపాడు. గాలి నింపుతుండగా టైర్ ఒక్కసారిగా పేలింది. దీంతో డ్రైవర్ 8 అడుగుల మేర గాల్లోకి ఎగిరిపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. మృతుడు సీకార్ ప్రాంతానికి చెందిన జోదూరామ్గా(38) పోలీసులు గుర్తించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని రూపన్‌గఢ్ ప్రభుత్వ ఆసుప్రతికి తరలించారు.
కారు టైర్ పేలి 8మంది సజీవదహనం
ఇటీవలే ఉత్తర్‌ప్రదేశ్ బరేలీలో డంపర్‌ను ఓ కారు ఢీకొట్టడం వల్ల మంటలు చెలరేగి ఎనిమిది మంది సజీవ దహనమయ్యారు. బహేడీ ప్రాంతానికి చెందిన కొందరు ఓ వివాహ కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తున్నారు. బరేలీ- నైనీతాల్ రహదారిపై వెళ్తున్న సమయంలో వారు ప్రయాణిస్తున్న కారు టైరు పేలిపోయింది. పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.