మహిళపై తీవ్రంగా దాడి చేసిన గేదె- కొమ్ములతో రోడ్డుపై ఈడ్చుకెళ్లి! - Buffalo Attack Video - BUFFALO ATTACK VIDEO
🎬 Watch Now: Feature Video
Published : Jun 17, 2024, 9:22 PM IST
Buffalo Attack On Woman Viral Video : తమిళనాడులోని చెన్నైలో ఓ మహిళపై గేదె తీవ్రంగా దాడి చేసింది. కొమ్ములతో రోడ్డుపై ఈడ్చుకుని వెళ్లింది. దీంతో బాధితురాలు తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అసలేం జరిగిందంటే?
తిరువొత్తియూర్ ప్రాంతానికి చెందిన మధుమతి తన బంధువు ఇంటికి వెళ్లేందుకు ఆదివారం రోడ్డుపైకి వచ్చింది. అదే సమయంలో ఓ గేది ఆమెపైకి దూసుకొచ్చింది. దీంతో ఆమె దుస్తులు గేదె కొమ్ముల్లో ఇరుక్కుపోయాయి. ఆ తర్వాత మధుమతిని రోడ్డుపై ఈడ్చుకుంటూ గేదె వెళ్లింది. ఆమెను కాపాడేందుకు కొందరు స్థానికులు ప్రయత్నించగా, వారిపై కూడా దాడి చేసింది.
చివరకు కొందరు కష్టపడి మధుమతిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలు చికిత్స పొందుతోంది. మధుమతి కాలికి బలమైన గాయం ఉందని, వైద్యులు 20 కుట్లు వేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆవు యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు పోలీసులను కోరారు.