LIVE : తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల మీడియా సమావేశం - BRS Leaders press meet live
🎬 Watch Now: Feature Video


Published : Mar 1, 2024, 8:40 AM IST
|Updated : Mar 1, 2024, 8:50 AM IST
BRS Leaders press meet live : కామధేనువంటి కాళేశ్వరాన్ని విఫల ప్రాజెక్టుగా చూపే ప్రభుత్వ యత్నాన్ని తిప్పికొడతామని బీఆర్ఎస్ పార్టీ నేడు మేడిగడ్డ, అన్నారం ఆనకట్టలను సందర్శించనుంది. పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలతో పాటు నీటిపారుదల నిపుణులు పర్యటనకు వెళ్లనున్నారు. అన్నారం వద్ద ప్రజెంటేషన్ ఏర్పాటు చేసి ప్రజలకు వాస్తవాలు చెప్పనున్నట్లు బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. ఇప్పటికే పార్టీ నాయకులు తెలంగాణ భవన్ చేరుకున్నారు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను సందర్శించనున్న క్రమంలో తెలంగాణ భవన్లో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. మేడిగడ్డపై కాంగ్రెస్ ప్రభుత్వం రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. ఇప్పటికీ కాఫర్‌డ్యాం నిర్మించి నీటిని ఎత్తిపోయవచ్చని అయినా ప్రభుత్వం ఆ ప్రయత్నం చేయడం లేదని ఆరోపించారు. రాజకీయంగా తమపై ఉన్న కోపంతో రైతులు, ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని ప్రభుత్వానికి సూచించారు. రెండు ఆనకట్టల వద్ద పర్యటన తర్వాత అన్నారం వద్ద ప్రజెంటేషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తమతో పాటు నీటిపారుదల శాఖ నిపుణులు కూడా పర్యటించనున్నట్లు వెల్లడించారు.
Last Updated : Mar 1, 2024, 8:50 AM IST