LIVE : ఎమ్మెల్సీ కవితకు బెయిల్ - దిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ నేతలు - BRS Leaders Live on Kavitha Bail
🎬 Watch Now: Feature Video
BRS Leaders Live : దిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరైంది. ఆమె బెయిల్ పిటిషన్‌పై విచారించిన జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథన్ ద్విసభ్య ధర్మాసనం, ఈడీ, సీబీఐ కేసులో బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా సీబీఐ తుది ఛార్జిషీట్ దాఖలు చేసిందని, ఈడీ దర్యాప్తు పూర్తి చేసిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. నిందితురాలు జైలులో ఉండాల్సిన అవసరం లేదని, అందుకే కవితకు బెయిల్ మంజూరు చేస్తున్నామని స్పష్టం చేసింది. మహిళగా కూడా పరిగణించాల్సిన అవసరం ఉందని వివరించింది. కవిత బెయిల్ పిటిషన్ విచారణ నేపథ్యంలో కేటీఆర్, హరీశ్‌రావు, కవిత భర్త అనిల్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు సోమవారం సాయంత్రమే దిల్లీ చేరుకున్నారు. బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పలువురు భారత రాష్ట్ర సమితి నేతలు దిల్లీలోని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్నారు.
Last Updated : Aug 27, 2024, 4:24 PM IST