పెండింగ్‌లో ఉన్న డీఏలను త్వరలోనే ప్రకటిస్తాం : మంత్రి రాజనర్సింహ - Minister Rajanarsimha On DA - MINISTER RAJANARSIMHA ON DA
Minister Rajanarsimha On DA : ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న డీఏలను త్వరలోనే విడుదల చేస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఉపాధ్యాయులందరికీ హెల్త్‌కార్డులు జారీ చేస్తామని వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా అందోల్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అందోల్ నియోజకవర్గంలోని ప్రతి పాఠశాలలో మెరుగైన వసతుల కల్పనకు కృషి చేస్తానని వెల్లడించారు. రూ.50 కోట్లతో ఆధునిక వసతులతో కూడిన ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని తెలిపారు.
Published : Sep 13, 2024, 10:41 PM IST
Minister Damodar Rajanarsimha On DA : సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో విద్య, వైద్య రంగాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబసంక్షేమశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పేర్కొన్నారు. విద్యార్థులకు మంచి బోధన అందించడమే కాకుండా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. దేశ, సమాజ నిర్మాణం టీచర్లపై ఉందని గుర్తుచేశారు. అందోల్ నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దామని ఆయన వివరించారు. ఉపాధ్యాయులందరికీ ప్రభుత్వం తరఫున హెల్త్ కార్డులను అందజేస్తామని వెల్లడించారు. నియోజక వర్గ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రధానోత్సవంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు.
స్కూళ్లలో మౌలికవసతుల కల్పనకు కృషి : త్వరలో 6వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నామని దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) ఫండ్స్‌తో అందోల్ నియోజకవర్గంలోని ప్రతి పాఠశాలలో మెరుగైన మౌలిక వసతుల కల్పనకు కృషిచేస్తామని హామీ ఇచ్చారు. అందోల్ నియోజకవర్గంలో ప్రతిష్ఠాత్మక జేఎన్టీయూను, మూడు పాలిటెక్నిక్ కళాశాలలను తెచ్చామన్న ఆయన నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేయబోతున్నట్లుగా వివరించారు.
రూ.50 కోట్లతో ఆధునిక ఆసుపత్రి : అందోల్ నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి వెల్లిడంచారు. రూ.50 కోట్లతో ఆధునిక ఆసుపత్రి ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. మెడికల్ కళాశాలల కోసం గత పాలకులు జీవోలు ఇచ్చి రాజకీయంగా వాడుకుంటున్నారు. జీవోలు ఇస్తే మెడికల్ కాలేజ్‌లు వస్తాయా? అని ప్రశ్నించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 8 మెడికల్ కాలేజ్‌లకు అనుమతులు సాధించామన్నారు.
"ప్రతి తెలంగాణ పౌరుడికి హెల్త్ కార్డు ఇవ్వబోతున్నాం. కుటుంబానికి రేషన్ కార్డు ఏవిధంగా ఉంటుందో అదే మాదిరిగా హెల్త్ కార్డు కూడా ఇవ్వబోతున్నాం. ఆందోల్ ప్రాంతానికి పాలిటెక్నిక్‌లు, జేఎన్టీయూను తీసుకొచ్చాం. పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కృషిచేస్తాను" - దామోదర రాజనర్సింహ, మంత్రి
పెండింగ్‌లో ఉన్న డీఏలు ఇస్తాం : కుటుంబంలోని ప్రతి వ్యక్తికి హెల్త్‌కార్డులు అందజేస్తామన్నారు. పెండింగ్‌లో ఉన్న డీఏలను త్వరలోనే అందజేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండు లక్ష్మణ్, రాష్ట్ర అసోసియేట్ ప్రైసిడెంట్ ఆకుల మనయ్య, అధ్యక్షులు సుబ్బారావు, నిర్మాణ కమిటీ సభ్యులు అందోలు మండల విద్యాధికారి బండి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
వారం రోజుల్లో గాంధీలో ఐవీఎఫ్ సేవలు : మంత్రి దామోదర - Damodara Inspections in Gandhi