T20ల్లో టీమ్ఇండియా అరుదైన ఘనత- తొలి జట్టుగా రికార్డ్ - Team India 150th Win - TEAM INDIA 150TH WIN
Team India 150th Win: టీమ్ఇండియా అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో 150 విజయాలు నమోదు చేసిన తొలి జట్టుగా రికార్డు కొట్ట్టింది.
Published : Jul 11, 2024, 6:57 AM IST
|Updated : Jul 11, 2024, 8:05 AM IST
Team India 150th Win: టీమ్ఇండియా అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో 150 విజయాలు నమోదు చేసిన తొలి జట్టుగా రికార్డు కొట్ట్టింది. బుధవారం జింబాబ్వేతో మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో నెగ్గిన టీమ్ఇండియా ఈ మైలురాయి అందుకుంది. 2006లో పొట్టి ఫార్మాట్ క్రికెట్ ప్రారంభించిన టీమ్ఇండియా 230 మ్యాచ్‌లు ఆడి150 నెగ్గగా, 69 మ్యాచ్‌ల్లో ఓడింది. ఇక 5 మ్యాచ్‌లు డ్రాగా ముగియగా, మరో ఆరింట్లో ఫలితం తేలలేదు.
2006లో సౌతాఫ్రికాతో తలపడ్డ భారత్ తొలి మ్యాచ్‌లోనే విజయం నమోదు చేసింది. కాగా, ఆ తర్వాత ఏడాదే జరిగిన టీ20 వరల్డ్‌కప్ కూడా టీమ్ఇండియా సొంతం చేసుకుంది. కాగా, ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్ హిస్టరీలో టీమ్ఇండియా మొత్తం 18 జట్లతో తలపడింది. అందులో పటిష్ఠ ఆస్ట్రేలియాతో 32సార్లు తలపడగా 20 మ్యాచ్‌ల్లో టీమ్ఇండియా నెగ్గింది. టీ20ల్లో భారత్ ఒకే ప్రత్యర్థిపై నమోదు చేసిన విజయాల్లో ఇదే అత్యధికం. ఇక వెస్టిండీస్, శ్రీలంక దేశాలపై 19 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. పొట్టి ఫార్మాట్లో పాకిస్థాన్‌ను 13సార్లు ఢీకొట్టగా 9 మ్యాచ్‌ల్లో నెగ్గింది.
ఏ జట్టుపై ఎన్నిసార్లు గెలిచిందంటే?
ఆస్ట్రేలియా | 32 | 20 |
బంగ్లాదేశ్ | 14 | 13 |
అఫ్గానిస్థాన్ | 9 | 7 |
సౌతాఫ్రికా | 27 | 15 |
ఇంగ్లాండ్ | 24 | 13 |
న్యూజిలాండ్ | 25 | 12 |
పాకిస్థాన్ | 13 | 9 |
వెస్టిండీస్ | 30 | 19 |
ఐర్లాండ్ | 8 | 8 |
జింబాబ్వే | 11 | 8 |
శ్రీలంక | 29 | 19 |
హాంకాంగ్ | 1 | 1 |
నమీబియా | 1 | 1 |
అమెరికా | 1 | 1 |
నేపాల్ | 1 | 1 |
నెదర్లాండ్స్ | 1 | 1 |
స్కాట్లాండ్ | 2 | 1 |
యూఏఈ | 1 | 1 |
- స్కాట్లాండ్పై 1 మ్యాచ్‌లో ఫలితం తేలలేదు
టీ20ల్లో అత్యధిక విజయాలు
- టీమ్ఇండియా- 150 విజయాలు
- పాకిస్థాన్- 142 విజయాలు
- న్యూజిలాండ్- 111 విజయాలు
- ఆస్ట్రేలియా- 105 విజయాలు
- సౌతాఫ్రికా- 104 విజయాలు
2024 వరల్డ్‌కప్‌లో 8 విజయాలు: అమెరికా, వెస్టిండీస్ సంయుక్త వేదికలుగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియా 8 విజయాలు నమోదు చేసింది. ఈ టోర్నీలో ఓటమి లేకుండా టీమ్ఇండియా వరుస విజయాలతో దూసుకెళ్లి దాదాపు 17ఏళ్ల తర్వాత ట్రోఫీని ముద్దాడింది. ఈక్రమంలో ఐసీసీ టోర్నమెంట్లో ఒక్క ఓటమి లేకుండా ట్రోఫీ నెగ్గిన జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది.
ఇక జింబాబ్వేతో మ్యాచ్ విషయానికొస్తే, తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లకు 182/4 పరుగుుల చేసింది. ఇక ఛేదనలో ఆతిథ్య జింబాబ్వే ఓవర్లన్నీ ఆడి 159/6 పరుగులకే పరిమితమైంది. స్పిన్‌తో మ్యాచ్ తిప్పేసిన వాషింగ్టన్ సుందర్ (3/15)కు ప్లేయర్ ఆఫ్ ది అవార్డు దక్కింది.
🔙 to 🔙 wins in Harare 🙌
— BCCI (@BCCI) July 10, 2024
A 23-run victory in the 3rd T20I as #TeamIndia now lead the series 2⃣-1⃣ 👏👏
Scorecard ▶️ https://t.co/FiBMpdYQbc#ZIMvIND pic.twitter.com/ZXUBq414bI
లంకతో సిరీస్ - టీమ్ఇండియా టీ20 జట్టు కెప్టెన్ ఎవరంటే? - IND VS Srilanka T20 Series
లంకతో సిరీస్ - టీమ్ఇండియా టీ20 జట్టు కెప్టెన్ ఎవరంటే? - IND VS Srilanka T20 Series