ETV Bharat / offbeat

సూపర్​ టేస్టీ అండ్​ హెల్దీ "పెసల పులావ్​" - ఇంట్లో ఇలా చేసి పిల్లలకు పెట్టండి- బలంగా ఉంటారు! - Moong Dal Pulao Recipe

How to Make Moong Dal Pulao Recipe : ఈ వర్షాకాలంలో కొన్నిసార్లు రోజూ అన్నం, పప్పు, కూర వంటివన్నీ వండుకుని తినాలంటే కాస్త బద్ధకంగానే ఉంటుంది. అయితే, ఇలాంటప్పుడు టేస్టీ అండ్​ హెల్దీ "పెసల పులావ్"​ ట్రై చేయండి. ఒక్కసారి ఈ విధంగా చేస్తే రుచి ఎంతో అద్భుతంగా ఉంటుంది.

Moong Dal Pulao Recipe
How to Make Moong Dal Pulao Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 25, 2024, 2:59 PM IST

Moong Dal Pulao Recipe : పెసలతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. వీటిని మొలకెత్తిన తర్వాత తినడం వల్ల బరువు తగ్గడంతో పాటు, రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే, హెల్దీ పెసలతో మనం కుక్కర్లో పులావ్​ ఎలా చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఈ సూపర్​ టేస్టీ పెసల పులావ్ రెసిపీని​ పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. దీనిని లంచ్​ బాక్స్​లో కూడా పెట్టవచ్చు. వారానికి ఒకసారి ఈ పులావ్​ పిల్లలకు పెట్టడం వల్ల వారు చాలా ఆరోగ్యంగా ఉంటారు. మరి ఇక లేట్​ చేయకుండా స్టోరీ మొత్తం చదివి ఈ పులావ్​ మీ ఇంట్లో ట్రై చేయండి.

కావాల్సిన పదార్థాలు..

  • బియ్యం -2 గ్లాసులు​
  • పెసలు-కప్పు
  • వాటర్​-మూడున్నర గ్లాసులు
  • దాల్చిన చెక్క
  • లవంగాలు-4
  • కరివేపాకు-1
  • కొత్తిమీర
  • పుదీనా
  • బిర్యానీ ఆకు
  • ఉల్లిపాయ-1
  • క్యారెట్​-2
  • పచ్చిమిర్చి-3
  • టమాటా-1
  • ఉప్పు రుచికి సరిపడా
  • కారం-టేబుల్​స్పూన్
  • ధనియాలపొడి-టీస్పూన్​
  • గరం మసాలా -అరటీస్పూన్​
  • పసుపు-చిటికెడు

తయారీ విధానం..

  • ముందుగా బియ్యం రెండుసార్లు కడిగి.. నీటిలో అరగంట నానబెట్టుకోండి. ఈ హెల్దీ పులావ్​​ రెసిపీ చేయడానికి మీరు ముందు రోజు రాత్రి పెసలను నానబెట్టుకోవాలి. ఇలా పెసలను నానబెట్టుకోవడం వల్ల రెసిపీలో మరిన్ని పోషకాలుంటాయి.
  • ఇప్పుడు ప్రెషర్​ కుక్కర్లో ఆయిల్​ వేసి వేడి చేయండి. ఇందులో దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు వేసి వేపండి. తర్వాత కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా, క్యారెట్​ ముక్కలు వేసి కలపండి.
  • అవి కొంచెం మగ్గిన తర్వాత కారం, ధనియాలపొడి, గరం మసాలా, పసుపు వేసి మిక్స్​ చేయండి. ఇందులో రాత్రంతా నానబెట్టుకున్న పెసలను శుభ్రంగా కడిగి వేసుకోండి.
  • రెండు నిమిషాలు మగ్గించిన తర్వాత.. నానబెట్టుకున్న రైస్​ వేయండి. కలిపి మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వండి.
  • ఇప్పుడు ఇందులో మూడున్నర గ్లాసుల నీటిని పోసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుని.. ప్రెషర్​ కుక్కర్​ మూత పెట్టండి.
  • ఒక మూడు విజిల్స్​ వచ్చిన తర్వాత స్టౌ ఆఫ్​ చేయండి. అంతే ప్రెషర్​ మొత్తం పోయిన తర్వాత సర్వ్​ చేసుకుంటే టేస్టీ అండ్​ హెల్దీ పెసల పులావ్​ రెడీ.
  • ఇలా పులావ్ చేసి పిల్లలకు పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. ఈ పులావ్​ ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.

ఇవి కూడా చదవండి :

స్కూల్లో లంచ్ బాక్స్ తినకుండా పిల్లలు ఇంటికి తెస్తున్నారా? - ఈ 'గార్లిక్ రైస్' పెట్టండి - మొత్తం ఖాళీ చేసేస్తారు!

నాన్​వెజ్​తో పోటీ పడే "మీల్ మేకర్ మసాలా కర్రీ"- ఇలా చేస్తే మటన్​ను మించిన టేస్ట్​ పక్కా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.