Best Fruits to Fight With Infections in Rainy Season: వర్షాకాలం స్టార్ట్ అయ్యిందంటే అనేక రకాల వ్యాధులు ఎటాక్ చేస్తాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఏదో ఒక ఆరోగ్య సమస్య వస్తూనే ఉంటుంది. జలుబు, దగ్గు మొదలు.. వర్షాకాలంలో డెంగ్యూ జ్వరం, మలేరియా, సీజనల్ ఫీవర్, టైఫాయిడ్ వంటి దోమల ద్వారా సంక్రమించే వ్యాధులు కూడా ఇబ్బంది పెడతాయి. ఈ క్రమంలోనే కొన్ని రకాల పండ్లు తీసుకుంటే ఈ ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా ఈ పండ్లు ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయని అంటున్నారు. మరి ఆ లిస్ట్‌లో ఏఏ పండ్లు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
బ్లూ బెర్రీ: వర్షాకాలంలో ఎదురయ్యే పలు రకాల ఆరోగ్య సమస్యలను తప్పించుకోవడానికి బ్లూబెర్రీలు సహాయపడతాయని నిపుణులు అంటున్నారు. వీటిని తీసుకోవడం ద్వారా తక్కువ క్యాలరీలు, ఐరన్, ఫోలేట్, పొటాషియం, విటమిన్లు వంటి పోషకాలు లభిస్తాయని... ఇవి చిన్న చిన్న వ్యాధులతో పోరాడటానికి ఉపయోగపడతాయంటున్నారు.
లిచీ: వర్షాకాలంలో లిచీ పండును కచ్చితంగా తినాలని నిపుణులు అంటున్నారు. వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుందని.. ఇది మన శరీరంలో శక్తి సామర్థ్యాన్ని పెంచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుందని అంటున్నారు. అలాగే జలుబు నుంచి ఉపశమనం అందిస్తుందని చెబుతున్నారు. అంతే కాకుండా శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లను కూడా అందించి బరువు తగ్గడంలో సహాయపడుతుందని వివరిస్తున్నారు.
2011లో యూరోపియన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం లిచీ పండ్లు తినే వ్యక్తులు జలుబు బారిన పడటం 20% తక్కువ అని కనుగొన్నారు. ఈ పరిశోధనలో బ్రిగామ్ యాంగ్ యూనివర్సిటీలో పోషకాహార శాస్త్ర ప్రొఫెసర్ డాక్టర్ డేవిడ్ జె. డంకన్ పాల్గొన్నారు.
పియర్స్: వర్షాకాలంలో అనేక ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి మనకు చాలా విటమిన్లు అవసరం. అయితే ఈ విటమిన్లు అన్నీ పియర్స్ పండ్లలో పుష్కలంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి క్రమం తప్పకుండా వీటిని తినమని సలహా ఇస్తున్నారు.
బొప్పాయి: బొప్పాయిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి ఇది చాలా బాగా సహాయపడుతుందని.. అంతే కాకుండా ఇందులో ఉండే పీచు అనేక వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడుతుందని అంటున్నారు. కాబట్టి వర్షాకాలంలో బొప్పాయి తినమని సలహా ఇస్తున్నారు.
చెర్రీస్: ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి అంటు వ్యాధులను నివారిస్తాయని.. మెదడుకు ప్రశాంతత, విశ్రాంతిని అందిస్తాయని అంటున్నారు.
దానిమ్మ: వర్షాకాలంలో ఎక్కువగా లభించే పండ్లలో దానిమ్మ ఒకటి. ఈ దానిమ్మ గింజలు అనేక పోషకాలను కలిగి ఉంటాయి. ముఖ్యంగా దానిమ్మలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం సహా జలుబు, దగ్గు వంటి వ్యాధులను నివారించడంలో సహాయపడుతుందని అంటున్నారు.
యాపిల్స్: రోజుకు ఒక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదంటారు. కారణం ఇందులోని పోషకాలు. ఎందుకంటే ఇవి అనేక వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడతాయని చెబుతున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఎంత ట్రై చేసినా బరువు తగ్గట్లేదా? - ఇలా చేస్తే వారానికి అరకిలో తగ్గడం గ్యారెంటీ! - Weight Loss Tips