'దిల్‌రాజులా నేను చేయలేను - అలాంటి పనులు ఆయనకే సాధ్యం' - Alluarvind Dilraju - ALLUARVIND DILRAJU
LOVE ME MOVIE PRE RELEASE EVENT : ప్రముఖ నిర్మాత దిల్‌రాజుపై మరో స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఏం అన్నారంటే?


Published : May 23, 2024, 10:40 PM IST
LOVE ME MOVIE PRE RELEASE EVENT : ఆశిష్, వైష్ణవీ చైతన్య కలిసి నటించిన కొత్త సినిమా లవ్ మీ. నూతన దర్శకుడు అరుణ్ భీమవరపు తెరకెక్కించారు. ఈనెల 25న రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో మూవీటీమ్ హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చీఫ్ గెస్ట్‌గా వచ్చి సందడి చేశారు. ఈ సందర్భంగా దిల్ రాజుపై ప్రశంసలు కురిపించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
"మీరు గతంలో ఏమైనా సినిమాలు చేశారా? అని అరుణ్‌ను అడిగితే చేయలేదని చెప్పారు. డైరెక్షన్లో ఎక్స్పీరియన్స్ లేని వారికీ ఛాన్స్‌లు ఇవ్వడం దిల్ రాజుకే సాధ్యం అని అన్నాను. వెంటనే మీరు కూడా చేయాలి సర్ అని ఆయన అనగా ఆ ధైర్యం నేను చేయలేనన్నాను(నవ్వుతూ). కీరవాణి, పీసీ శ్రీరామ్‌లాంటి స్టార్ టెక్నిషియన్స్‌తో మొదటి సినిమాకే పని చేయడం అరుణ్ అదృష్టం. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను" అని అల్లు అరవింద్ ఆకాంక్షించారు.
లక్ష్యం అదే - "హర్షిత్ రెడ్డి సినిమాపై ఉన్న ప్యాషన్‌తో ప్రొడ్యూసర్‌గా మారాడు. హన్షిత చిన్నప్పటి నుంచి షూటింగ్స్‌కు వెళ్లేది. కానీ ఇండస్ట్రీలోకి వస్తుందని అనుకోలేదు. వీరిద్దరు కలిసి దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై సినిమాలు నిర్మిస్తున్నారు. అలా మొదటి సినిమా బలగంతో వేణు యెల్దండిని డైరెక్టర్‌గా ఇంట్రడ్యూస్ చేశారు. లవ్ మీతో అరుణ్‌కు అవకాశం ఇచ్చారు. హరి, శాండీ ఇలా ఇంకొంతమంది ఉన్నారు. త్వరలోనే వారి సినిమాల గురించి అనౌన్స్ చేస్తాం. ఈ ప్రొడక్షన్ హౌస్ ద్వారా కొత్త వారిని ఎంకరేజ్ చేయాలనేదే మా లక్ష్యం. ఆశిష్ చిన్నప్పుడు నుంచే డ్యాన్స్ మంచిగా వేస్తాడు. అతడి జోష్ చూసి హీరో అవుతాడని అప్పుడే అనుకున్నాను. నాకు సినిమా తప్ప మరో రంగంపై ఇంట్రెస్ట్ లేదు. అందుకే నేను వేరే బిజినెస్లేమీ చేయట్లేదు. లవ్ మీ సవాలుతో కూడిన కథ. దర్శకత్వంలో ఎక్స్పీరియన్స్ లేకపోయినా అరుణ్ సూపర్‌గా తెరకెక్కించారు. కీరవాణి గారు అందించిన సంగీతం సినిమాకు ప్రత్యేకం. ఆయన 10 పాటలు ఇచ్చారు. కానీ ఐదు పాటలనే సినిమాలో ఉపయోగించుకున్నాం." అని దిల్ రాజు పేర్కొన్నారు.