తెలంగాణ

telangana

ETV Bharat / snippets

ఇస్రో ఛైర్మన్​ సోమనాథ్​కు ఐఏఎఫ్ పురస్కారం

By ETV Bharat Telugu Team

Published : Oct 15, 2024, 6:42 AM IST

ISRO Chairman Somanath
ISRO Chairman Somanath (ANI)

IAF Award To ISRO Chief Somnath :భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్​, డీవోఎస్​ సెక్రటరీ డాక్టర్​ సోమనాథ్​కు ప్రతిష్ఠాత్మక ఐఏఎఫ్​ వరల్డ్ స్పేస్ పురస్కారం లభించిది. చంద్రుడిపై పరిశోధనల్లో గణనీయమైన పురోగతి సాధించిన చంద్రయాన్​-3 మిషన్​కు సోమనాథ్​ నేతృత్వం వహించిన నేపథ్యంలో ఆయనకు ఈ అవార్డ్ ప్రకటించారు. ఇటలీలోని మిలాన్​లో సోమవారం జరిగిన పురస్కార ప్రదానోత్సవంలో ఐఏఎఫ్​ ప్రతినిధుల చేతుల మీదుగా ఇస్రో అధిపతి సోమనాథ్​ పురస్కారం స్వీకరించారు. ఈ అవార్డ్ అందుకున్నందుకు తనకు ఎంతో గర్వంగా ఉందని ఈ సందర్భంగా సోమనాథ్ ఆనందం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details