Mumbai Indians Bowling Coach : ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. 2025 ఐపీఎల్ కోసం జట్టులో కీలక మార్పు చేసింది. తమ జట్టు బౌలింగ్ కోచ్‌గా పరాస్ మాంబ్రేను నియమించింది. పరాస్ మాంబ్రే ప్రస్తుత బౌలింగ్ కోచ్ లసిత్ మలింగతో వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం పనిచేస్తారని వెల్లడించింది.
'ముంబయి ఇండియన్స్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా పరాస్ మాంబ్రే నియమితులయ్యారు. ఆయన తిరిగి మళ్లీ ముంబయికు వస్తున్నారు. ముంబయి ప్రస్తుత బౌలింగ్ కోచ్ మలింగతో కలిసి పనిచేస్తారు. అలాగే ముంబయి హెచ్ కోచ్ మహేల జయవర్ధనేతో కలిసి కోచింగ్ టీమ్‌లోనూ భాగంగా ఉంటారు' అని ముంబయి ఇండియన్స్ ఓ ప్రకటన విడుదల చేసింది.
𝐏𝐚𝐫𝐚𝐬 𝐌𝐡𝐚𝐦𝐛𝐫𝐞𝐲 returns HOME 💙
— Mumbai Indians (@mipaltan) October 16, 2024
Read more 👉 https://t.co/f9oozQGg8e#MumbaiMeriJaan #MumbaiIndians pic.twitter.com/qFHsPEkRs0
గతంలో ముంబయితోనే
కాగా, పరాస్ మాంబ్రే గతంలోనూ ముంబయి ఇండియన్స్ కోచింగ్ టీమ్‌లో భాగంగా ఉన్నాడు. పరాస్ కోచ్‌గా ఉన్న సమయంలో ముంబయి 2013లో ఐపీఎల్ ట్రోఫీ నెగ్గింది. అలాగే టీ20 ఛాంపియన్స్ లీగ్ 2011, 2013లో విజయం సాధించింది. 2010లో రన్నరప్‌గా నిలిచింది.
టీమ్ఇండియా మాజీ ప్లేయర్
పరాస్ మాంబ్రే టీమ్ఇండియా తరఫున 1996-1998 మధ్య రెండు టెస్టులు, మూడు వన్డేలు ఆడాడు. మొత్తంలో 5వికెట్లు పడగొట్టాడు. అలాగే ముంబయి తరఫున దేశవాళీ క్రికెట్ ఆడాడు. 91 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 284 వికెట్లు తీశాడు. 83 లిస్ట్ ఏ మ్యాచ్‌ల్లో 111 వికెట్లు పడగొట్టాడు.
వరల్డ్‌కప్ విన్నింగ్ కోచ్: 2024 టీ20 వరల్డ్‌కప్‌లో టీమ్ఇండియాకు బౌలింగ్ కోచ్‌గా పరాస్ మాంబ్రే వ్యవహరించాడు. 2021లో ఈ బాధ్యతలు స్వీకరించిన పరాస్ పదవీకాలం రీసెంట్గా ముగిసింది.
జయవర్దనే మళ్లీ ముంబయికే
ముంబయి ఇండియన్స్ హెడ్ కోచ్‌గా మహేల జయవర్దనే ఇటీవల ఎంపికయ్యాడు. 2017- 2022 వరకు ముంబయి హెడ్ కోచ్‌గా పని చేసిన జయవర్దనే, 2017, 2019, 2020 సీజన్లలో టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ పదవి నుంచి వైదొలిగాడు. మార్క్ బౌచర్ 2023, 2024 ఎడిషన్లలో ముంబయికి హెడ్ కోచ్‌గా పని చేశాడు.
ముంబయితో రోహిత్, SRHతో భువీ జర్నీ ఓవర్?- ఇక ఫ్రాంచైజీ మారడం పక్కా! - Rohit Sharma Mumbai Indians