ETV Bharat / technology

మార్కెట్లోకి శాంసంగ్ ఫస్ట్​ పిట్​నెస్​ రింగ్- ధర ఎంతో తెలుసా?​ - SAMSUNG FIRST SMART RING

స్మార్ట్​రింగ్​ లాంచ్ చేసిన శాంసంగ్- ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!!!

Samsung Galaxy First Smart Ring
Samsung Galaxy First Smart Ring (Samsung)
author img

By ETV Bharat Tech Team

Published : Oct 16, 2024, 5:54 PM IST

Samsung Galaxy First Smart Ring: దక్షిణ కొరియా టెక్ దిగ్గజ కంపెనీ శాంసంగ్‌ తన మొదటి స్మార్ట్‌ రింగ్‌ను లాంచ్‌ చేసింది. మతి చెదిరే ఫీచర్లతో మూడు కలర్ ఆప్షన్లతో వీటిని తీసుకొచ్చింది. తొమ్మది వేర్వేరు సైజుల్లో ఈ స్మార్ట్​ రింగ్స్​ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది జులైలో పారిస్‌లో జరిగిన ఈవెంట్‌లో గెలాక్సీ జీ ఫోల్డబుల్‌ ఫోన్‌తో పాటు ఈ రింగ్‌ను శాంసంగ్‌ ఆవిష్కరించింది. తాజాగా ఈ స్మార్ట్‌రింగ్‌ను ఇండియన్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. శాంసంగ్‌, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఎంపిక చేసిన రిటైల్ స్టోర్స్​ ద్వారా ఈ శాంసంగ్ కొత్త స్మార్ట్​రింగ్​ను కొనుగోలు చేయొచ్చని కంపెనీ తెలిపింది. దీనికి సంబంధించిన ప్రీ-బుకింగ్స్ ఇండియాలో ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా దీని ధర, ఫీచర్లపై లుక్కేద్దాం రండి.

శాంసంగ్ తొలి స్మార్ట్‌ రింగ్‌ ఫీచర్స్:

  • ఈ శాంసంగ్ స్మార్ట్​ రింగ్‌లో ఏఐ ఆధారిత హెల్త్‌ ట్రాకింగ్‌, స్లీప్‌ మానిటరింగ్‌ ఫీచర్లు ఉన్నట్లు కంపెనీ తెలిపింది.
  • ఇది IP68 రేటింగ్‌తో వస్తోంది.
  • గెలాక్సీ ఏఐ సదుపాయంతో తీసుకొచ్చిన ఈ రింగ్‌తో అనేక రకాల హెల్త్‌ ఫీచర్లను ట్రై చేయొచ్చని శాంసంగ్ చెబుతోంది.
  • స్లీప్‌ స్కోర్‌, స్నోరింగ్‌ అనాలసిస్‌, స్లీప్‌ మెట్రిక్‌, స్లీప్‌ లేటెన్సీ, హార్ట్‌ రేట్‌, రెస్పిరేటరీ రేటు వంటివి ఈ రింగ్‌ ట్రాక్‌ చేస్తుంది.
  • శాంసంగ్‌ హెల్త్‌ యాప్‌లో ఈ వివరాలన్నీ నమోదవుతాయి.
  • ఈ రింగ్‌ సింగిల్‌ ఛార్జితో ఏడు రోజుల పాటు బ్యాటరీ లైఫ్‌ ఇస్తుందని శాంసంగ్ చెబుతోంది.
  • టైటానియమ్‌ బాడీతో తీసుకొచ్చిన ఈ రింగ్‌లో స్మార్ట్‌ టచ్‌ కంట్రోల్స్‌ ఫీచర్లు ఉన్నాయి.
  • ఈ ఫీచర్ల సాయంతో ఫొటోస్ తీయడం, అలారమ్‌ ఆఫ్‌ చేయడం వంటివి చేయొచ్చు.

శాంసంగ్ స్మార్ట్‌ రింగ్​లో కలర్ ఆప్షన్స్:

  • టైటానియమ్‌ బ్లాక్‌
  • టైటానియమ్‌ సిల్వర్‌
  • టైటానియమ్‌
  • గోల్డ్‌

శాంసంగ్ స్మార్ట్‌ రింగ్​లో సైజ్ ఆప్షన్స్: శాంసంగ్ ఈ కొత్త స్మార్ట్‌ రింగ్‌ తొమ్మిది వేర్వేరు సైజుల్లో మార్కెట్లో అందుబాటులో ఉంటుంది.

శాంసంగ్‌ తొలి ఫిట్‌నెస్‌ రింగ్‌ ధర: ఇండియన్ మార్కెట్లో వీటి ధర రూ.38,999 నుంచి ప్రారంభం అవుతుందని శాంసంగ్ వెల్లడించింది.

హలో సైడ్​ ప్లీజ్- స్పేస్​ నుంచి రాయల్​ ఎన్​ఫీల్డ్​ ఈవీ వస్తోంది- టీజర్ చూశారా?

చిమ్మ చీకట్లో కూడా వీడియో కాల్స్- వాట్సాప్​ కొత్త ఫీచర్​ను యాక్టివేట్ చేసుకోండిలా..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.