ETV Bharat / snippets

ఫ్లోరిడాను వణికించిన మిల్టన్‌ హరికేన్‌ - 14 మంది మృతి

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 11, 2024, 7:56 AM IST

US Hurricane Milton
US Hurricane Milton (AP)

Hurricane Milton Death Toll : హెలీన్‌ తుపాను ధాటికి ఇటీవల బెంబేలెత్తిన అమెరికాను తాజాగా మిల్టన్‌ హరికేన్‌ వణికించింది. ప్రధానంగా ఫ్లోరిడా రాష్ట్రంలో దాని తీవ్రత ఎక్కువగా కనిపించింది. మిల్టన్‌ దెబ్బకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. దీనితో ఆ రాష్ట్రంలో 34 లక్షల మందికిపైగా ఇబ్బందిపడ్డారు. హరికేన్‌ సంబంధిత వేర్వేరు ఘటనల్లో 14 మంది మృత్యువాతపడ్డారు. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 45 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మిల్టన్‌ దెబ్బకు రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్తు తీగలు తెగిపడ్డాయి. పలు ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి. ఫ్లోరిడాలోని హిల్స్‌బరో, పినెలాస్, సారసొటా, లీ కౌంటీల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.