ETV Bharat / offbeat

సూపర్ బ్రేక్​ఫాస్ట్ రెసిపీ - పుల్లపుల్లని "సేమియా పులిహోర" - నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోండిలా! - SEMIYA PULIHORA RECIPE

మార్నింగ్​ బ్రేక్​ఫాస్ట్​లో ఈ అద్దిరిపోయే రెసిపీని ట్రై చేయండి - ఇంటిల్లిపాది ఇష్టంగా తినడం పక్కా!

How to Make Semiya Pulihora
Semiya Pulihora Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 16, 2024, 6:58 PM IST

How to Make Semiya Pulihora Recipe : మనందరికీ పులిహోర అనగానే.. అన్నంలో నిమ్మరసం లేదా చింతపండు రసం వేసుకొని ప్రిపేర్ చేసుకోవడమే ముందుగా గుర్తొస్తుంది. కానీ, ఎప్పుడైనా సేమియాతో పులిహోర ట్రై చేశారా? లేదంటే మాత్రం ఇప్పుడే ట్రై చేసి చూడండి. సూపర్ టేస్టీగా ఉండడమే కాదు.. చాలా ఈజీగా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మార్నింగ్ దోశ, ఇడ్లీ వంటివి ప్రిపేర్ చేసుకోవడానికి టైమ్ లేనప్పుడు ఈ సేమియా పులిహోరను చాలా త్వరగా రెడీ చేసుకోవచ్చు! అందరికీ.. ఈ రెసిపీ చాలా బాగా నచ్చుతుంది. ఇంతకీ, దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • సేమియా - ఒకటిన్నర గ్లాసు(పెద్ద గ్లాసుతో)
  • నిమ్మకాయలు - 2 లేదా 3
  • ఉప్పు - రుచికి సరిపడా
  • ఆయిల్ - 4 స్పూన్లు

పోపు కోసం :

  • నూనె - తగినంత
  • పల్లీలు - 3 స్పూన్లు
  • శనగపప్పు - 1 స్పూన్
  • మినపపప్పు - 1 స్పూన్
  • జీలకర్ర - అర టీస్పూన్
  • ఆవాలు - అర టీస్పూన్
  • జీడిపప్పు పలుకులు - కొన్ని
  • ఎండుమిర్చి - 8 నుంచి 10
  • పచ్చిమిర్చి - 6(నిలువుగా కట్ చేసుకోవాలి)
  • కరివేపాకు - కొద్దిగా
  • ఇంగువ - పావు టీస్పూన్
  • పసుపు - చిటికెడు

తయారీ విధానం :

  • ముందుగా రెసిపీలోకి కావాల్సిన నిమ్మరసాన్ని తయారుచేసుకోవాలి. ఇందుకోసం ఒక చిన్న బౌల్​లో నిమ్మకాయలను కట్ చేసి పిండుకోవాలి. తర్వాత అందులో తగినంత ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై గిన్నె పెట్టుకొని అందులో సేమియా ఉడికించుకోవడానికి కావాల్సిన పరిమాణంలో వాటర్ పోసుకోవాలి. ఆపై నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకొని మరిగించుకోవాలి. నూనె వేయడం వల్ల సేమియా అంటుకోకుండా పొడిపొడిగా వస్తుంది.
  • నీళ్లు మరిగాయనుకున్నాక.. సేమియా వేసి బాగా మిక్స్ చేసుకొని మరో రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్​ మీద ఉడికించుకోవాలి. అయితే, మరీ ఎక్కువగా ఉడికించుకున్నా సేమియా మెత్తగా అయిపోతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కాబట్టి 80% వరకు ఉడికించుకుంటే సరిపోతుంది.
  • ఆవిధంగా ఉడికించుకున్న సేమియాను.. ఏదైనా చిల్లుల గిన్నెలోకి వడకట్టుకోవాలి. అలా వడకట్టుకున్నాక మరోసారి నార్మల్ వాటర్ పోసి వార్చుకోవాలి. ఆపై.. మరో గిన్నెలోకి ట్రాన్స్​ఫర్​ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఎందుకంటే.. అదే గిన్నెలో ఉంటే సేమియా అంటుకుపోయినట్టు అవుతుంది.
  • ఇప్పుడు సేమియా పులిహోర కోసం పోపును ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక.. పల్లీలను వేసి రంగు మారేంత వరకు వేయించుకోవాలి.
  • ఆ తర్వాత అందులో శనగపప్పు, మినపపప్పు, జీలకర్ర, ఆవాలు, జీడిపప్పు పలుకులు వేసుకొని కాసేపు వేయించుకోవాలి.
  • అలా వేయించుకున్నాక.. ఎండుమిర్చి, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు, ఇంగువ, పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆపై మిశ్రమాన్ని పోపు మంచిగా వేగేంత వరకు కలుపుతూ వేయించుకొని స్టౌ ఆఫ్ చేసుకోవాలి.
  • ఇప్పుడు బౌల్​లో ఉడికించుకుని పెట్టుకున్న సేమియాను తీసుకొని ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న నిమ్మరసాన్ని వేసుకొని అంతా కలిసేలా చేతితో జాగ్రత్తగా కలుపుకోవాలి.
  • ఆ తర్వాత అందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న పోపును కొద్దికొద్దిగా వేసుకుంటూ అన్నీ కలిసేలా ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే "సేమియా పులిహోర" రెడీ!

ఇవీ చదవండి :

తెలుగు వారికి ఎంతగానో నచ్చే సేమియా ఉప్మా - పొడి పొడిగా ఇలా చేసేయండి - పిల్లలు ఇష్టంగా తినేస్తారు!

కేవలం 10 నిమిషాల్లోనే రుచికరమైన "పల్లీల రైస్"​ - పిల్లల లంచ్ బాక్స్​లోకి పర్ఫెక్ట్​ రెసిపీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.