ETV Bharat / state

భారీ వేతనంతో ఇన్సూరెన్స్ కంపెనీలో జాబ్స్​​ - మీ చేతిలో డిగ్రీ ఉందా- ఐతే అప్లై చేసుకోండిలా!

యూఐఐసీలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు - కొలువు కొట్టారా రూ.50 వేల పైచిలుకు జీతం పక్కా

Government Job Notification for Administrative Officer Posts in UIIC
Notification for Administrative Officer Posts in UIIC (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 16, 2024, 3:54 PM IST

Updated : Oct 16, 2024, 4:16 PM IST

Administrative Officer Jobs in UIIC : ప్రభుత్వ రంగ జాబ్స్​ కోసం ప్రయత్నిస్తున్న అభ్యర్థులు అందరికీ గుడ్ న్యూస్​. చెన్నైలోని యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (UIIC), దేశ వ్యాప్తంగా యూఐఐసీ ఆఫీసుల్లో ఖాళీగా ఉన్న అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నియామకాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇది ఇండియాలోని ప్రముఖ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. కంపెనీ వివిధ అడ్మినిస్ట్రేటివ్ పోస్టులకు సంబంధించి తరచుగా ఖాళీలను ప్రకటిస్తుంది. అందులో భాగంగానే స్పెషలిస్టులు, జనరలిస్ట్ పోస్టుల భర్తీకి తాజాగా ప్రకటనను జారీచేసింది. ఈ నోటిఫికేషన్​కు సంబంధించి విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు తదితర పూర్తి సమాచారం మీ కోసం.

Job Name - Vacancy :

1. స్పెషలిస్టులు: 100

2. జనరలిస్ట్‌లు: 100

మొత్తం పోస్టుల సంఖ్య : 200

విభాగాలు : రిస్క్ మేనేజ్‌మెంట్, లీగల్ డేటా అనలిటిక్స్‌, ఫైనాన్స్‌ అండ్ పెట్టుబడి, ఆటోమొబైల్, కెమికల్/ మెకాట్రానిక్స్‌ తదితరాలు.

అర్హత : పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో సీఏ/ సీడబ్ల్యూఏ, డిగ్రీ (లా/ బీకామ్), బీఈ/ బీటెక్, ఎంఈ/ ఎంటెక్, ఎంకామ్ క్వాలిఫికేషన్​తో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి : 30 ఏళ్లు మించి వయస్సు ఉండకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ క్యాండిడేట్లకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు వర్తిస్తుంది.

జీత భత్యాలు : నెలకు రూ.50,925 - రూ.96,765 మధ్యన ఉంటాయి.

అప్లికేషన్ ఫీజు : రూ.1000+జీఎస్‌టీ; ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.250, జీఎస్‌టీ అదనంగా ఉంటుంది

ఎంపిక ప్రక్రియ : ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఉంటుంది.

దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ విధానంలో మాత్రమే అప్లై చేయాలి.

అప్లికేషన్​కు చివరి తేదీ : 05-11-2024

UIIC Officers Application Process :

  • అభ్యర్థులు ముందుగా యూఐసీసీ అధికారిక వెబ్​సైట్​ https://uiic.co.in/ ఓపెన్ చేయాలి. అందులో దిగువన ఉన్న Careers లో రిక్రూట్​మెంట్​ ఆప్షన్​ను ఎంచుకోవాలి.
  • RECRUITMENT OF ADMINISTRATIVE OFFICERS (SCALE 1) GENERALISTS AND SPECIALISTS Link పై క్లిక్ చేయాలి.
  • అప్లికేషన్​ ఫారమ్​లో మీ వ్యక్తిగత, విద్యార్హత వివరాలు నమోదు చేయాలి.
  • అవసరమైన డాక్యుమెంట్స్​ అన్నింటినీ అప్లోడ్ చేయాలి.
  • ఆన్​లైన్​లోనే దరఖాస్తు ఫీజు కూడా చెల్లించాలి.
  • అన్ని వివరాలు మరోసారి చెక్​ చేసుకొని, దరఖాస్తును ఫైనల్​గా సబ్మిట్ చేయాలి.
  • ఫ్యూచర్​ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్​అవుట్​ భద్రపరుచుకోవాలి.

ఇంటర్‌ అర్హతతో రైల్వేలో జాబ్స్ - మొదటి నెల నుంచే రూ.40 వేల శాలరీ - చివరి తేదీ ఎప్పుడంటే?

పది పాసైతే చాలు ఐటీబీపీలో కానిస్టేబుల్‌ కొలువులు - చివరి తేదీ ఎప్పుడంటే ?

Last Updated : Oct 16, 2024, 4:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.