Nigeria Tanker Blast : నైజీరియాలో పెట్రోల్ ట్యాంకర్ పేలి 140మందికి పైగా మృతిచెందారు. వీరిలో చిన్నారులు కూడా ఉన్నట్లు బుధవారం అధికారులు వెల్లడించారు. మరో డజను మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. కానో రాష్ట్రం నుంచి బయల్దేరిన ట్యాంకర్ జిగావా రాష్ట్రంలోని మజియా పట్టణంలో అర్థరాత్రి 12.30 గంటల సమయంలో ప్రమాదానికి గురైంది. హైవేపై ప్రయాణిస్తున్న సమయంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్ల ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదం గురించి తెలుసుకున్న స్థానికులు భారీగా ఘటనా స్థలానికి చేరుకుని పెట్రోల్‌ను నింపుకొనేందుకు యత్నించారు. ఈ సమయంలోనే మంటలు చెలరేగడం వల్ల ట్యాంకర్ పేలింది.
ట్యాంకర్ బోల్తా- పెట్రోల్ తీసుకుందామని వెళ్లి 140మందికి పైగా మృతి
Published : Oct 16, 2024, 4:34 PM IST
|Updated : Oct 17, 2024, 6:20 AM IST