How to Make Mixed Sprouts Curry: శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా అందాలంటే.. డైలీ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని చెబుతుంటారు నిపుణులు. అందులో భాగంగానే చాలా మంది మొలకలు(Sprouts) తింటుంటారు. మొలకల్లో విటమిన్స్, యాంటీఆక్సిడెంట్లు, మినరల్స్ సమృద్ధిగా ఉండి కొవ్వులు, కేలరీలు తక్కువగా ఉండటమే ఇందుకు కారణం. అయితే మొలకలు అంటే.. చాలా మంది పెసర్ల నుంచి వచ్చేవే తింటారు. కానీ.. ఇంకా చాలా రకాల మొలకలు ఉంటాయి. బీన్స్, బఠానీలు, శనగలు, వేరు శనగలతోపాటు తృణధాన్యాల మొలకలు కూడా తీసుకోవచ్చు. అయితే.. వీటన్నింటిని కూడా విడిగా తీసుకుంటారు. లేకపోతే స్నాక్స్ టైప్‌లో అన్నీ కలిపి తింటుంటారు. అయితే.. ఇవే కాదు మొలకలతో రుచికరమైన కూర కూడా తయారు చేసుకోవచ్చు. రుచి అద్దిరిపోతుంది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం..
కావాల్సిన పదార్థాలు:
పేస్ట్ కోసం:
- మిరియాలు - అర టీ స్పూన్
- పచ్చి కొబ్బరి ముక్కలు - పావు కప్పు
- అల్లం ముక్క - చిన్నది
- పచ్చిమిర్చి - 3
- జీలకర్ర - అర టీ స్పూన్
- పుదీనా ఆకులు - 20
- కొత్తిమీర - పిడికెడు
కర్రీ కోసం:
- నూనె - 2 టేబుల్ స్పూన్లు
- జీలకర్ర - పావు టీ స్పూన్
- కరివేపాకు - 2 రెబ్బలు
- ఉల్లిపాయ - 1
- సన్నగా తరిగిన టమాటా ముక్కలు - 2
- ఉప్పు - రుచికి సరిపడా
- ధనియాల పొడి - అర టీ స్పూన్
- పసుపు - పావు టీ స్పూన్
- మిక్సిడ్ మొలకలు - ఒకటింపావు కప్పు
- వేడి నీరు - కప్పున్నర
- కసూరీ మేథీ - కొద్దిగా
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
- గరం మసాలా - పావు టీ స్పూన్(ఆప్షనల్)
తయారీ విధానం:
- ముందుగా మొలకలు ప్రిపేర్ చేసుకోవాలి. అందులో మీకు నచ్చినవి ఏవైనా తీసుకుని మొత్తంగా ఒకటింపావు కప్పు ప్రిపేర్ తీసుకోవాలి.
- ఆ తర్వాత ఉల్లిపాయ, టమాటలను సన్నగా కట్ చేసుకోవాలి.
- ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులోకి మిరియాలు, పచ్చి కొబ్బరి ముక్కలు, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, పుదీనా ఆకులు, కొత్తిమీర వేసి కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తని పేస్ట్‌గా చేసుకుని పక్కన పెట్టాలి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి నూనె వేేసుకోవాలి. ఆయిల్ హీటెక్కిన తర్వాత జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ తరుగు వేసి ఆనియన్స్ కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి.
- ఉల్లిపాయలు మగ్గిన తర్వాత టమాట ముక్కలు వేసి వాటి తోలు విడిపడేంతవరకు మెత్తగా ఫ్రై చేసుకోవాలి.
- టమాటలు ఉడికిన తర్వాత పసుపు, ఉప్పు, ధనియాల పొడి వేసి ఫ్రై చేసుకోవాలి.
- అనంతరం మెత్తగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి మిశ్రమాన్ని వేసి పావు కప్పు నీరు పోసి ఓ 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి.
- ఆ తర్వాత ముందే ప్రిపేర్ చేసుకున్న మొలకలు వేసి ఓ మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి.
- ఇప్పుడు కప్పున్నర వేడి వేడి నీరు పోసి మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి.
- విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆవిరి పోయేంతవరకు అలానే ఉంచాలి. స్టీమ్ పోయిన తర్వాత మూత తీసి స్టవ్ ఆన్ చేసి మరికొద్దిసేపు మరిగించాలి.
- ఆ తర్వాత కసూరీ మేథీ, కొత్తిమీర తరుగు, గరం మసాలా వేసి ఓ రెండు నిమిషాలు పాటి ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
- అంతే ఎంతో రుచికరంగా, ఎన్నో పోషకాలు కలిగిన మొలకల కూర రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.
ఆరోగ్యానికి మేలు చేసే "మునగాకు ఫ్రై" - పదే పది నిమిషాల్లో చేసుకోండిలా! - టేస్ట్ అద్భుతం!
"కాకరకాయ" కూరను ఇలా వండి చూడండి - చేదు అస్సలే ఉండదు - వద్దన్నవారే ఇష్టంగా తింటారు!
గుడ్డు లేకుండా అద్దిరిపోయే "బ్రెడ్ ఆమ్లెట్" - ఇలా ప్రిపేర్ చేస్తే ఇంకా కావాలంటారు!