ETV Bharat / offbeat

వావ్ అనిపించే బట్టర్ గార్లిక్ ఎగ్ రెసిపీ - ఘుమఘుమలకే మైమరచిపోతారు! - HOW TO MAKE GARLIC EGG RECIPE

- సరికొత్త రుచిని అద్భుతంగా ఆస్వాదిస్తారు!

How to Make garlic Egg Reciepe
How to Make garlic Egg Reciepe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 24, 2024, 7:01 AM IST

Spice Egg Recipe : ఎగ్​తో ఎన్నో రకాల రెసిపీస్ తయారు చేసుకోవచ్చు. అయితే.. చాలా మంది ఏదో ఒక కూరగాయలో ఎగ్ మిక్స్ చేస్తారు. లేదంటే ఆమ్లెట్ వేసుకొని తింటారు. కానీ.. ఎప్పుడూ ఒకే తీరుగా తింటే ఏం బాగుంటుంది? అందుకే.. ఈ సారి సరికొత్తగా బట్టర్ గార్లిక్ ఎగ్​ రెసిపీని ట్రై చేయండి. తిన్నారంటే.. అద్దిరిపోయిందని అంటారు! అంత గొప్పగా ఉంటుంది దీని రుచి. మరి.. ఈ రెసిపీకి ఏమేం పదార్థాలు కావాలి? దీన్ని ఎలా తయారు చేయాలి? అన్నది ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు..

ఎగ్స్ - 4

మిరియాల పొడి - కొద్దిగా

నెయ్యి - 1 స్పూన్

వెల్లుల్లి రెబ్బలు - 10

కార్న్ ఫ్లోర్ - 1/2 స్పూన్

మిల్క్ - 1/2 కప్

చిల్లీ ఫ్లేక్స్ - 1/2 స్పూన్

మసాలా - తగినంత

కొత్తిమీర

ఉప్పు

తయారీ విధానం..

  • ముందుగా నాలుగు కోడి గుడ్లు తీసుకొని.. వాటిని కొట్టి బౌల్​ లో పోయాలి.
  • అందులో రుచికి సరిపడా ఉప్పు, కాస్త మిరియాల పొడి వేసుకోండి. ఇవన్నీ చక్కగా కలిసిపోయేలా మిక్స్ చేసుకోండి.
  • ఇప్పుడు స్టౌపైన పాన్ పెట్టి, అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి.
  • ఈ నెయ్యి కరిగిపోయిన తర్వాత.. ఇప్పుడు బీట్ చేసుకున్న ఎగ్ లిక్విడ్​ ను వేసేయండి. మీడియం ఫ్లేమ్​లో ఉంచి ఉడికించండి. మెల్లగా ఆమ్లెట్ తయారవుతూ ఉంటుంది.
  • పూర్తిగా ఆమ్లెట్​ అయ్యేదాకా చూడొద్దు. 70 పర్సెంట్ కుక్ అయిన తర్వాత గరిటతో ముక్కలుగా చిదుముకోవాలి. (ఇది చాలా ముఖ్యమైన స్టేజ్.. లేకుంటే ఆమ్లెట్​ అయిపోతుంది)
  • 80 పర్సెంట్ ఉడికిన తర్వాత ప్లేట్​లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి.
  • ఇప్పుడు మళ్లీ పాన్​లో ఓ స్పూన్ నెయ్యి వేసి, కరిగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 10 వెల్లుల్లి రెబ్బల్ని ఇందులో వేసేయండి.
  • నెయ్యి వాటికి పూర్తిగా పట్టేలా ఇలా కలుపుకోండి. కాసేపు నెయ్యిలో వెల్లుల్లి వేగితే ఆ టేస్టే వేరుగా ఉంటుంది.
  • తర్వాత కాస్త మిరియాల పొడి వేసుకోండి.
  • ఆ తర్వాత ఆఫ్ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేయండి.
  • ఇప్పుడు హాఫ్ కప్ మిల్క్ పోయండి. చక్కగా కలుపుకున్న తర్వాత హాఫ్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి.
  • కాస్త కొత్తిమీర, కాస్త మసాలా యాడ్ చేయండి. ఉప్పు కూడా తగినంత వేసుకోండి.
  • ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత.. ఎగ్ పీసెస్ ఇందులో వేయండి.
  • ఆ లిక్విడ్ మొత్తం ఎగ్ పీసెస్​కు పట్టేలా మిక్స్ చేయండి. కాసేపు ఉంచి, దించుకోండి.
  • ఇది మీ పిల్లలకు తినిపించారంటే.. మళ్లీ మళ్లీ కావాలని అడిగి తీరుతారు. నచ్చితే ఇవాళే మీ ఇంట్లో దీన్ని తయారు చేయండి. ఈ సండే ఎంజాయ్ చేసేయండి.

ఇవి కూడా చదవండి :

గుడ్డు లేకుండా అద్దిరిపోయే "బ్రెడ్​ ఆమ్లెట్" - ఇలా ప్రిపేర్ చేస్తే ఇంకా కావాలంటారు!

గుంత పొంగనాల కోసం పిండి ఎందుకు గురూ? - వీటితో క్షణాల్లో చేసేయండి - టేస్ట్​ ఎంజాయ్​ చేయండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.