Border Gavaskar Trophy AUS vs IND 1st Test : బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతోన్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా క్రికెటర్ మిచెల్ స్టార్క్, భారత యంగ్ పేసర్ హర్షిత్ రాణా ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఆడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వారిద్దరు ప్రత్యర్థులుగా బరిలోకి దిగారు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో స్టార్క్‌కు రాణా బౌలింగ్ చేశాడు. బౌన్సర్లతో ఇబ్బంది పెట్టేందుకు గట్టిగా ప్రయత్నించాడు.
Harshit Rana Mitchell Starc : అప్పుడు 'హర్షిత్, నీకన్నా నేనే ఎక్కువగా ఫాస్ట్ వేస్తాను. నువ్వు కూడా బాగానే వేస్తున్నావ్. అయితే, నీకన్నా నేనే వేగంగా వేస్తాను' అని స్టార్క్ సరదాగా స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ఆ మాటలకు హర్షిత్ నవ్వుకున్నాడు.
ఇంకా తాను స్ట్రైకింగ్‌కు వచ్చినప్పుడు ఎలా బంతులు సంధించాలో కూడా చెప్పాడు స్టార్క్. మరింత వేగంతో పాటు షార్ట్ పిచ్ బౌలింగ్ చేయాలని సూచించాడు. 'నాకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి' అంటూ చెప్పాడు. ఈ సంభాషణకు సంబంధించిన వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది.
Mitch Starc offers a little warning to Harshit Rana 😆#AUSvIND pic.twitter.com/KoFFsdNbV2
— cricket.com.au (@cricketcomau) November 23, 2024
కాగా, ప్రస్తుతం జరుగుతోన్న ఈ తొలి టెస్టులో భారత్, ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లు ముగిశాయి. మొత్తం 20 వికెట్లు పేసర్లకే దక్కాయి. టీమ్‌ఇండియా ఇన్నింగ్స్‌లో జోష్ హేజిల్‌వుడ్ 4, మిచెల్ స్టార్క్ 2, కమిన్స్ 2, మిచెల్ మార్ష్ 2 వికెట్లు తీశారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు జస్‌ప్రీత్ బుమ్రా 5, హర్షిత్ రాణా 3, మహ్మద్ సిరాజ్ 2 తీశారు. బుమ్రా ఐదు లేదా అంతకన్నా ఎక్కువ వికెట్ల ప్రదర్శన చేయడం ఇది 11వ సారి. ఆస్ట్రేలియా గడ్డపై ఇది రెండోసారి కావడం విశేషం. మొదటి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా 104 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు ఆలౌట్ అయింది.
'నా భర్త శరీరంలో ఆ భాగం సూపర్‌గా ఉంటుంది' - వైరల్‌గా మారిన బుమ్రా భార్య పోస్ట్
బీసీసీఐ, పీసీబీతో ఐసీసీ అత్యవసర సమావేశం - ఆ ఐదు అంశాలపై చర్చ!