ETV Bharat / entertainment

'అన్​స్టాపబుల్' చరిత్రలో నయా రికార్డు - బన్నీ బాలయ్య ఎపిసోడ్​లో అవే హైలైట్స్​! - NBK UNSTOPPABLE SEASON 4

బన్నీ, బాలయ్య ఎపిసోడ్​కు ఓటీటీలో రికార్డు బ్రేకింగ్ వ్యూవ్స్​!

NBK Unstoppable Season 4 Allu Arjun Episode
Allu Arjun Balakrishna (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 24, 2024, 7:42 AM IST

NBK Unstoppable Season 4 Allu Arjun Episode : ప్రతి ఎపిసోడ్​లో కొత్తదనాన్ని చూపిస్తూ అతిథులతో సందడి చేస్తుంటారు నటసింహం నందమూరి బాలకృష్ణ. ఆయన హోస్ట్ చేసే 'అన్​స్టాపబుల్' ప్రోగ్రామ్​కు ఆడియెన్స్​లో మంచి క్రేజ్ ఉంది. ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ప్రస్తుతం జరుగుతున్న నాలుగో సీజన్​తోనూ సక్సెస్​ఫుల్​గా రన్ అవుతోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు నెట్టింట ఓ రేర్​ రికార్డు బ్రేక్ చేసి తెగ ట్రెండ్ అవుతోంది. అదేంటంటే?

ఈ కాంబో అదర్స్!
రీసెంట్​గా ఈ షోకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పెషల్​ గెస్ట్​గా వచ్చారు. ఇక బన్నీతో పాటు తన తల్లి నిర్మల అలాగే కుమారుడు అయాన్​, కుమార్తె అర్హ కూడా ఈ ప్రోగ్రామ్​కు వచ్చి సందడి చేశారు. ఎంతో ఎంటర్​టైనింగ్​గా సాగిన ఈ ఎపిసోడ్​లో బన్నీ చాలా ఎనర్జిటిక్​గా మాట్లాడారు. బాలయ్యతో తన సినిమాల గురించి అలాగే కొన్ని పర్సనల్ ముచ్చట్లు కూడా చెప్పుకున్నారు.

ఇదిలా ఉండగా, ఎక్కువ నిడివి కారణంలా ఈ ఎపిసోడ్​ను రెండు భాగాలుగా రిలీజ్ చేసింది ఆహా టీమ్. అయితే అందులోని రెండో పార్ట్​ మాత్రం తాజాగా ఓ రికార్డును బ్రేక్ చేసినట్లు తెలుస్తోంది. బన్నీ తన ఇద్దరు పిల్లలతో చేసిన అల్లరితో చాలా ఎంటర్టైనింగ్​గా సాగిన ఆ ఎపిసోడ్​కి రికార్డు స్థాయి వ్యూవ్స్​ వచ్చాయట. ఇప్పటి వరకు అన్‌స్టాపబుల్ చరిత్రలో ఏ ఎపిసోడ్​కి రానన్ని వ్యూస్ ఈ వీడియోకు వచ్చాయని ఆహా ప్రకటించింది. బాలయ్య టైమింగ్, అలాగే అల్లు అర్జున్ క్రేజ్, అర్హ- అయాన్​ల అల్లరితో ఈ ఎపిసోడ్​కు అన్ని వ్యూస్ వచ్చాయని పేర్కొంది.

ఇక బన్నీ ప్రస్తుతం 'పుష్ప 2' షూటింగ్ అండ్ ప్రమోషన్స్​లో బిజీ బిజీగా ఉన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ బ్యాక్​డ్రాప్​లో డైరెక్టర్ సుకుమార్‌ ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే వచ్చిన 'పుష్ప ది రైజ్‌' బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనికి సీక్వెల్​గా 'పుష్ప ది రూల్' రూపొందుతోంది. ఓ సాధారణ క కూలీగా ప్రయాణం ప్రారంభించి ఎర్రచందనం సిండికేట్‌ను శాసించే రేంజ్​కు ఎదిగిన పుష్ప గురించి పార్ట్‌ 1లో చూపించారు. పుష్ప రాజ్‌గా బన్నీ ఊరమాస్‌ యాక్షన్‌, అలాగే శ్రీవల్లి పాత్రలో రష్మిక నటన ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది.

పవన్ కల్యాణ్ గురించి బాలయ్య ప్రశ్న - ఆసక్తికర సమాధానమిచ్చిన అల్లు అర్జున్​

'కౌన్‌ బనేగా కరోడ్‌పతి'లో అల్లు అర్జున్ పై ప్రశ్న - ఏమని అడిగారంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.