Group-1 Candidates Protest : నగరంలోని అశోక్‌నగర్‌లో బుధవారం రాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. గూపు అభ్యర్ధులు ఒక్కసారిగా రహదారి పైకి చేరుకోవడంతో పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. ఈనెల 21 నుంచి జరిగే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డులపైకి చేరుకుని నినాదాలు చేస్తు ర్యాలీ చేపట్టారు. పోలీసులు వారి వెంటే కొంత దూరం నడిచారు. వందల సంఖ్యలో చేరుకున్న అభ్యర్ధులు గతంలో జరిగిన ప్రిలిమ్స్ పరీక్షల్లో తప్పులు, జీవో 29 సవరించిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఆందోళనకంగా మారడంతో పోలీసులు అభ్యర్ధులను అదుపులోకి తీసుకుని వివిధ ఠాణాలకు తరలించారు. ముందుజాగ్రత్తగా అశోక్‌నగర్ పరిసరాల్లో భారీగా పోలీసు బలగాలను అధికారులు మోహరించారు. ఇప్పటివరకు 10మందిని అదుపులోకి తీసుకొని చిక్కడపల్లి పోలీస్ ఠానాకు తరలించారు.
అశోక్ నగర్లో పరిస్థితి ఆందోళనకరం - మళ్లీ రోడ్డెక్కిన గ్రూప్-1 అభ్యర్థులు - GROUP 1 CANDIDATES PROTEST IN HYD
అశోక్‌నగర్‌లో నిరసనకు దిగిన గ్రూప్స్ అభ్యర్థులు - 10 మందిని అదుపులోకి తీసుకుని చిక్కడపల్లి పీఎస్‌కి తరలింపు
Published : Oct 16, 2024, 10:30 PM IST
|Updated : Oct 16, 2024, 10:54 PM IST