ETV Bharat / state

టేస్ట్​లో బెస్ట్ -​ నేటికీ తగ్గని క్రేజ్ "అంకాపూర్ చికెన్" సొంతం - కారణాలేంటో మీకు తెలుసా? - WHY IS ANKAPUR DESI CHICKEN FAMOUS

నాటుకోడి కూర తినాలంటే అంకాపూర్ వెళ్లాల్సిందే - ఆ చికెన్​ అంతటి క్రేజ్ సంపాదించడం వెనుక దాగి ఉన్న కారణాలివే!

Ankapur Desi Chicken Special Story
Ankapur Desi Chicken (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 16, 2024, 10:50 PM IST

Ankapur Desi Chicken Special Story : నాన్​వెజ్ ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలో ఉన్న అంకాపూర్. చుట్టూ పచ్చని పంటచేలు.. నగరాన్ని తలపించేలా అందమైన భవనాలతో కొలువుదీరిన ఈ గ్రామం పేరు మస్త్ ఫేమస్ అయింది. అందుకు ప్రధాన కారణం.. ఇక్కడ ప్రత్యేకంగా వండే దేశీ నాటుకోడి కూర. బయట ఎన్ని రకాల చికెన్ ఐటమ్స్ ఉన్నా.. ఇతర చోట్ల ఎక్కడ తిన్నా ఈ చికెన్ కర్రీ రుచి రాదు. అంతేకాదు.. ఆ మార్గంలో ప్రయాణిస్తే మాత్రం తినకుండా వెళ్లరనడం అతిశయోక్తి కాదు. అలాగే.. చుట్టుపక్కల ఎక్కడ సమావేశాలు, విందులు ఉన్నా.. ఈ ఊరు నాటుకోడి కూర విధిగా ఉండాల్సిందే. అయితే, అసలు.. "అంకాపూర్ చికెన్" వరల్డ్ వైడ్​ అంతలా ఫేమస్ అవ్వడం వెనుక దాగి ఉన్న కారణాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

దాదాపు 45 నుంచి 50 ఏళ్ల కిందట గ్రామంలో మొదట తాళ్లపల్లి రామాగౌడ్‌ అనే వ్యక్తి ఈ నాటుకోడి కూర వండటం స్టార్ట్ చేశారు. ఈయన చేసే చికెన్‌ కారంగా, ఘాటుగా అద్భుతమైన టేస్ట్​ ఉండటంతో.. స్థానికంగా అందరి నోళ్లలో పడి మెల్లమెల్లగా జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల జిల్లాలకు పాకింది. ఇది తినేందుకే ఆదివారాలు ఇక్కడికి వచ్చే వారూ ఉన్నారు. రోజురోజుకు డిమాండ్‌ పెరుగుతుండటంతో కుటుంబమంతా ఆర్డర్‌ మీద కావాల్సిన వాళ్లకు పంపించే బిజినెస్ కొనసాగించారు. క్రమంగా ఊర్లో ఇతరులూ ఆర్డర్‌ మెస్‌లు ప్రారభించారు.

అంతేకాదు.. వ్యవసాయరంగంలో అంకాపూర్​కి జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు రావడంతో ఇక్కడికి రైతులు, సందర్శకులు నిత్యం వందల మంది వచ్చిపోతుంటారు. పాతికేళ్లుగా దేశ విదేశాల అతిథులు ఇక్కడికి వచ్చి రైతులు చేస్తున్న వినూత్న వ్యవసాయంపై అధ్యయనం చేసి స్థానిక రుచులను ఆస్వాదించి వెళ్తుంటారట. అలా.. అంకాపూర్‌ ‘దేశీ చికెన్‌’గా ఇక్కడి వంటకం ప్రత్యేకమైన పేరును సంపాదించుకుంది.

టేస్ట్​లో బెస్ట్.. నేటికీ తగ్గని క్రేజ్! : అంకాపూర్ చికెన్​ను ఒక్కసారి టేస్ట్ చేసిన ఎవరైనా సరే ఈ మార్గంలో ప్రయాణిస్తే తినకుండా వెళ్లరు. అంతేకాదు.. నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చే ఏ అధికారి అయినా, పొలిటల్ లీడర్ అయినా తప్పకుండా లంచ్​లో ఈ చికెన్ రెసిపీ ఉండేలా చూసుకుంటారట. అలాగే.. కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల ఉద్యోగుల మీటింగ్స్​కి భోజనాల్లో అంకాపూర్ చికెన్​ను ప్రిఫర్ చేస్తున్నారంటే.. దీని క్రేజ్​ ఏ రేంజ్​లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

తయారీ కోసం ప్రత్యేకంగా మసాలాలు : అంకాపూర్ నాటుకోడి కూర వండేందుకు మసాలాలు ప్రత్యేకంగా ఎప్పుటికప్పుడు తయారు చేసుకుంటారు. లవంగాలు, ధనియాలు, కొబ్బరి పొడి, యాలకులు, అల్లం, ఎల్లిగడ్డ, ఉల్లి, పుదీనా, కొత్తిమీర వంటకానికి ముందే దంచి పెట్టుకుంటారు. అలాగే.. వంటలో వాడేందుకు నాణ్యమైన నూనె ఉపయోగిస్తారు.

కిలోల లెక్కన కాదు.. కోడి లెక్క : ఇక్కడ చికెన్​(నాటు కోడికూర)ను కిలోల లెక్కన ఇవ్వరు. కోడి లెక్కన వండి అమ్ముతారు. అయితే, సాధారణంగా ఒక పూర్తి కోడి నుంచి ముప్పావుకిలో వరకు చికెన్ వస్తుందట. ముగ్గురు వ్యక్తులు తినేంతగా రైస్​తో పాటు ఇచ్చే చికెన్​ కర్రీకి 850 రూపాయల వరకు తీసుకుంటారట. అదే.. రైస్ వద్దనుకుంటే 750 రూపాయలు ఛార్జ్ చేస్తారని సమాచారం. బయటి మార్కెట్లతో పోల్చితే ఇక్కడ చికెన్ ధర ఎక్కువగానే ఉంటుంది. కానీ.. టేస్ట్, దీనికున్న క్రేజ్‌ను బట్టి డబ్బులకు వెనుకాడకుండా అంకాపూర్ చికెన్​ని ఆస్వాదిస్తుంటారు కస్టమర్లు.

ఎల్లలు దాటిన రుచి.. ఎంతో మందికి జీవనోపాధి! : మొదట చుట్టుపక్కల గ్రామాల వారికి అంకాపూర్ చికెన్​ని సరఫరా చేసిన వ్యాపారస్థులు.. నేడు తెలంగాణ మాత్రమే కాదు ఇతర రాష్ట్రాలు, గల్ఫ్ దేశాలు, అమెరికా వంటి దేశవిదేశాలు సైతం ఈ చికెన్ కర్రీ పార్సిళ్లు వెళ్తున్నాయి. అలాగే.. ఇక్కడ నివసిస్తున్న ఎన్నో కుటుంబాలు దేశీ చికెన్​ను వండివ్వడం, హోటళ్లను నడపడం వంటి వాటిపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. ఎలాంటి హంగూ, ఆర్భాటాలు లేకుండా అంకాపూర్ చికెన్ మెస్ బిజినెస్​ను నడుపుతూ.. ఇక్కడి వ్యాపారులు ఆర్థికంగానూ బాగానే సంపాదిస్తున్నారు.

అంతేకాదు.. ఇక్కడి చికెన్ వ్యాపారులు నిజామాబాద్, హైదరాబాద్​ వంటి నగరాలలో స్థిరపడి.. అక్కడ కూడా "అంకాపూర్ స్పెషల్ చికెన్​" పేరిట బిజినెస్​ని విస్తరించుకోవడం గమనార్హం. అదేవిధంగా.. అంకాపూర్​లో నాటుకోడి కూర అమ్మకాలకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఇక్కడే దేశీ కోళ్ల పెంపకాన్ని ఉపాధి అవకాశంగా ఎంచుకొని వ్యాపారం సాగిస్తున్నారు ఇక్కడి వ్యాపారులు. అందుకోసం.. కరీంనగర్, వరంగల్ నుంచి నాటు కోళ్లను తెప్పించుకుని వాటికి ప్రత్యేకమైన దాణాను అందిస్తూ పెంచుతున్నారు. అంతేకానీ.. ప్రైవేట్ ఫాముల నుంచి బ్రీడ్​ను తీసుకొని పెంచేందుకు ఇష్టపడరు ఇక్కడి వ్యాపారులు. ఇది కూడా అంకాపూర్ చికెన్​కి అంతటి పేరు రావడానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు.

ఇవీ చదవండి :

అంకాపూర్ విలేజ్ - ఇక్కడి చికెన్​కు మాత్రమే కాదు మక్క బుట్టలకూ ఫుల్ డిమాండ్!

నాటుకోళ్లతో రూ.కోట్ల సంపాదన​ - ఈ యంగ్ టెకీ బిజినెస్ ఐడియా అదుర్స్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.