Death Threat To Biden : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు బెదిరింపులు రావడం కలకలం సృష్టించింది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన కొన్ని రోజుల్లోనే, బైడెన్‌కు కూడా బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. అధ్యక్షుడికి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
బైడెన్‌కు బెదిరింపులు - ఫ్లోరిడాకు చెందిన నిందితుడు అరెస్ట్!
Published : Jul 18, 2024, 8:23 AM IST
|Updated : Jul 18, 2024, 8:35 AM IST
ఫ్లోరిడాకు చెందిన జేసన్ పాట్రిక్ అనే వ్యక్తి ఈ బెదిరింపులకు పాల్పడినట్లు భద్రతా సిబ్బంది గుర్తించారు. అతడిని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపర్చారు. తరువాత విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకున్నారు. నిందితుడు బైడెన్ సహా ఇతర ఫెడరల్ అధికారులకు సైతం బెదిరింపు సందేశాలు పంపినట్లు విచారణలో తెలిసింది. బైడెన్‌ను బెదిరిస్తూ 'ఎక్స్'లోనూ పోస్ట్‌లు పెట్టినట్లు అధికారులు గుర్తించారు. అయితే అతడి మానసిక స్థితి సరిగా లేదని సమాచారం.