ETV Bharat / bharat

కోల్​కతా మెడికో హత్యాచారం కేసు కీలక మలుపు! RG కర్‌ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్‌ అరెస్ట్- ఓ పోలీసు కూడా - CBI Arrests Ex Principal Of RG Kar

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 14, 2024, 10:06 PM IST

Updated : Sep 14, 2024, 10:53 PM IST

CBI Arrests Ex Principal Of RG Kar : కోల్​కతా ఆర్​జీ కర్​ ఆస్పత్రిలో వైద్యురాలి హత్యాచారం కేసులో మరో కీలక పరిణామం జరిగింది. ఈ కేసులో ఆర్​జీ కర్‌ మాజీ ప్రిన్సిపల్​, ఓ పోలీసు అధికారిని సీబీఐ అరెస్ట్ చేసింది.

CBI Arrests Ex Principal Of RG Kar
CBI Arrests Ex Principal Of RG Kar (ETV Bharat)

CBI Arrests Ex Principal Of RG Kar : బంగాల్​లోని కోల్​కతా ఆర్​జీ కర్​ ఆస్పత్రి జూనియర్ వైద్యురాలి హత్యాచారం కేసులో మరో కీలక పరిణామం జరిగింది. ఈ కేసులో ఆర్​జీ కర్‌ మాజీ ప్రిన్సిపల్​ను సీబీఐ అరెస్ట్ చేసింది. మరో పోలీసు అధికారిని కూడా అరెస్టు చేసినట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది. మెడికల్‌ కాలేజీలో ఆర్థిక అవకతవకలకు పాల్పడిన కేసులో ఇప్పటికే సందీప్‌ ఘోష్‌ను సీబీఐ అరెస్టు చేసింది. తాజాగా డాక్టర్ అత్యాచారం కేసులో సందీప్ అరెస్ట్ అయ్యారు.

సంబరాలు చేసుకున్న డాక్టర్లు :
సందీప్ ఘోష్‌ అరెస్ట్​తో డాక్టర్లు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఓ జూనియర్ డాక్టర్ మాట్లాడారు. "సాక్ష్యాలను తారుమారు చేయడం వల్ల కళాశాల మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్, తాలా పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి అధికారి అభిజిత్ మోండల్​ను అరెస్టు చేయాలని మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నాము. ఈ అరెస్ట్ ఆనందాన్ని కలిగిస్తోంది'' అని వైద్యుడు తెలిపారు.

సందీప్ ఘోష్, తాలా పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి అభిజిత్ మండల్‌లను సీబీఐ అరెస్టు చేయడంపై కేంద్ర మంత్రి, బీజేపీ నేత సుకాంత మజుందార్ స్పందించారు. "ఈ రోజు చేసిన అరెస్టులు చాలా ముఖ్యమైనవి. ముఖ్యంగా తాలా పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి అరెస్టు. అత్యాచారం కేసులో అవకతవకలకు పాల్పడ్డాడనే ఆరోపణలపై అరెస్టయ్యారు. వాళ్లను అరెస్టు చేయాలని బంగాల్ ప్రజలు మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు. నా ప్రశ్న ఏమిటంటే, ఒక చిన్న స్టేషన్ ఇన్‌చార్జి అలాంటి నిర్ణయం తీసుకోగలడా? ఇక బంగాల్ ప్రజలు ముఖ్యమంత్రిని ఆ పదవి నుంచి తొలగిస్తారు" అని సుకాంత మజుందార్ అన్నారు.

RG కర్​ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్​పై IMA సస్పెన్షన్ వేటు- సీబీఐ ముమ్మర దర్యాప్తు - Kolkata Doctor Case

లైవ్​ స్ట్రీమింగ్​కు మమత ససేమిరా- అలా చేయాలని పట్టుబట్టిన వైద్యులు! చర్చలపై ఉత్కంఠ! - Doctor Murder Case

Last Updated : Sep 14, 2024, 10:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.