ETV Bharat / snippets

ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంచిన చైనా- ఎంత ఏజ్​ వరకు పనిచేయొచ్చో తెలుసా?

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 13, 2024, 3:26 PM IST

china retirement age
china retirement age (Associated Press)

China Retirement Age: వచ్చే ఏడాది జనవరి నుంచి ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును పెంచాలని చైనా నిర్ణయించింది. తగ్గుతున్న జనాభా, పెరుగుతున్న శ్రామిక శక్తి వయసు అందుకు కారణం. కాగా, ప్రస్తుతం ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో అతి తక్కువ రిటైర్మెంట్ ఏజ్ ఉన్న దేశం చైనానే.

ప్రస్తుతం పురుష ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 60. దాన్ని 63కు పెంచనున్నారు. అలాగే బ్లూకాలర్ మహిళా ఉద్యోగులు 50 ఏళ్లు, వైట్ కాలర్ ఉమెన్ ఎంప్లాయిస్ 55 సంవత్సరాలకు పదవీ విరమణ చేస్తున్నారు. వారి ఉద్యోగాలను బట్టి రిటైర్మెంట్ ఏజ్​ను 55, 58 సంవత్సరాలకు పెంచనున్నారు. 'చైనాలో ఎక్కువ మంది ఉద్యోగులు పదవీ విరమణకు సిద్ధంగా ఉన్నారు. వారికి ప్రభుత్వం పెన్షన్ ఫండ్ అందించాల్సి ఉంటుంది. దీంతో ఒక్కసారిగా ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుంది. అందుకే రిటైర్మెంట్ వయసు పెంపు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.' అని సీనియర్ రీసెర్చ్ ఫెలో జియుజియాన్ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.