ETV Bharat / state

నిత్యావసర సరకుల ధరలు పైపైకి - దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో - ESSENTIALS RATES HIKE IN TELANGANA

Essentials Rates Increased in Telangana : దేశంలో సగటు వ్యక్తి ఆదాయం గత 12 ఏళ్లలో రెట్టింపైనా జీవన ప్రమాణాల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. సామాన్యుల రోజువారీ జీవనానికి కావాల్సిన నిత్యావసర వస్తువుల నుంచి వైద్యం వరకూ ఖర్చులు అంతే స్థాయిలో పెరిగాయి. దేశంలోని ప్రధాన రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో ఈ ధరలు కొండెక్కి కూర్చున్నాయి. కేంద్రం తాజాగా విడుదల చేసిన వినియోగదారుల ధరల సూచిక 2024 ఆగస్టు నివేదిక పలు అంశాలను స్పష్టం చేసింది.

Essential Prices Increases in Telangana
NSSO Report 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 18, 2024, 9:28 AM IST

Essential Prices Increase in Telangana : మన రాష్ట్రంలో సగటు వ్యక్తి జీవనం రోజురోజుకూ మరింత భారంగా మారుతోంది. దేశంలోని ప్రధాన రాష్ట్రాలో పోలిస్తే మన రాష్ట్రంలో నిత్యావసర సరుకులు, వైద్య ఖర్చులు బాగా పెరిగాయి. వాస్తవానికి ధరల జాతీయ సగటు దాదాపు వంద శాతం పెరిగినట్లు కనిపిస్తున్నా ప్రాంతాలవారీగా విడివిడిగా చూస్తే కొన్నిచోట్ల దాదాపు 200 శాతం పెరిగినవి కూడా ఉన్నాయి.

ఏమిటీ నివేదిక : ఎన్‌ఎస్‌ఎస్‌వో సంస్థకు చెందిన క్షేత్రస్థాయి సిబ్బంది దేశవ్యాప్తంగా 1,114 పట్టణ మార్కెట్లు, మరో 1,181 గ్రామాల నుంచి సేకరించిన ధరల వివరాలతో ‘వినియోగదారుల ధరల సూచిక’ (కన్స్యూమర్ ప్రైస్‌ ఇండెక్స్‌-సీపీఐ), ‘వినియోగదారుల ఆహార ధరల సూచిక’ (కన్స్యూమర్‌ ఫుడ్‌ ప్రైస్‌ ఇండెక్స్‌-సీఎఫ్‌పీఐ) 2024 ఆగస్టు నివేదికను విడుదల చేసింది. కీలకమైన నిత్యావసర సరకుల ధరల్లో పెరుగుదల తీరును సరకులవారీగా, రాష్ట్రాలవారీగా కేంద్రం నివేదికలో వివరించింది.

కూరగాయలు, పప్పుల ధరలు పైపైకి : 2023 ఆగస్టుతో పోలిస్తే 2024 ఆగస్టులో దేశంలో మాంసం, చేపలు, సుగంధ ద్రవ్యాల ధరల ద్రవ్యోల్బణం తగ్గినట్లు ఇందులో తెలిపింది. ఆహార ధరల సూచిక జాతీయ సగటు ఏడాది వ్యవధిలో 192.5 నుంచి 203.4కు పెరిగింది. దేశంలో అన్ని నిత్యావసరాలను పరిశీలిస్తే కూరగాయల ధరల సూచిక జాతీయ సగటు అత్యధికంగా 260.6కి చేరింది. గత ఏడాదితో పోలిస్తే కూరగాయల ధరల ద్రవ్యోల్బణం 10.71 శాతం, పప్పులు, వాటి ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 13.60 శాతం పెరగడం గమనార్హం. అన్ని రకాల నిత్యావసరాల ద్రవ్యోల్బణం 3.65 శాతం ఉందంటే ఇవి ఏ స్థాయిలో పెరిగాయో అర్థం చేసుకోవచ్చు.

ఇక్కడ సారవంతమైన భూములున్నా : రాష్ట్రాలవారీగా సాధారణ వినియోగదారుల ధరల సూచిక(సీపీఐ) 2024 జులై, ఆగస్టు మధ్య ఎలా పెరిగిందో కేంద్రం వివరించింది. ఉదాహరణకు సీపీఐ 2012లో 100 పాయింట్లు ఉండగా, 2024 ఆగస్టులో ఎంతకు చేరిందో రాష్ట్రాలవారీగా వెల్లడించింది. 2012-24 మధ్యకాలంలో జాతీయ సగటు 100 నుంచి 193 పాయింట్లకు పెరిగింది. త్రిపుర 215, మణిపుర్‌ 213.4, తెలంగాణ 201.6 పాయింట్లతో తొలి 3 స్థానాల్లో నిలిచాయి.

మణిపుర్, త్రిపురలు దేశ ఈశాన్య ప్రాంతంలో మారుమూలన ఉన్నందువల్ల రవాణా ఛార్జీలు అధికమై నిత్యావసరాల ధరలు ఎక్కువగా ఉండటం సహజం. కానీ, సారవంతమైన భూములు, సమృద్ధిగా వనరులు ఉన్న తెలంగాణ 201.6 సీపీఐతో ప్రధాన రాష్ట్రాల్లో అగ్రస్థానంలో ఉండటం ఇక్కడ నిత్యావసరాల ధరల పెరుగుదలకు అద్దం పడుతోంది.

ప్రధాన రాష్ట్రాలతో పోల్చినా : 2023 ఆగస్టులో నమోదైన సీపీఐ పాయింట్లతో 2024 ఆగస్టు పాయింట్లను పోల్చి 22 ప్రధాన రాష్ట్రాల వివరాలను విడిగా కేంద్రం విడుదల చేసింది. వీటిలో 201.6 సీపీఐతో తెలంగాణ అగ్రస్థానంలో నిలవగా, జమ్మూ-కశ్మీర్‌ 200.1, కేరళ 198 పాయింట్లతో వరసగా 2, 3 స్థానాల్లో ఉన్నాయి. 2023 ఆగస్టులో 197.6 పాయింట్లతో 22 రాష్ట్రాల్లో అగ్రస్థానంలో ఉన్న తెలంగాణ.. 2024 ఆగస్టులో 201.6 పాయింట్లతో అదే స్థానంలో కొనసాగింది.

దేశంలో 2024 ఆగస్టు నాటికి వివిధ సామాగ్రి ధరల సూచిక పాయింట్లు ఇలా ఉన్నాయి

కూరగాయలు260.6
మాంసం- చేపలు223.3
పప్పులు214.7
స్నాక్స్, స్వీట్లు203.3
వ్యక్తిగత అలంకరణ199.8
వైద్యం195.4
దుస్తులు194.1
పండ్లు191.4
గుడ్లు189.0
విద్య188.5
పాలు, పాల ఉత్పత్తులు186.36
చెప్పులు184.7
ఇంటి సామాగ్రి, సేవలు180.9
ఇంధనం, దీపాలు176.6
జాతీయ సగటు193.0

దేశంలో నిత్యావసరాల ధరల సూచిక 2012లో 100 పాయింట్లుంది.

ఫ్యూచర్‌ సిటీలో గ్రీన్‌ఫీల్డ్‌ హైవే సన్నాహాలు - 8 వేల ఎకరాల భూసేకరణ - Land Acquisition for Future City

పల్లెలకు ఫ్రీ సోలార్ విద్యుత్ - పైలట్ ప్రాజెక్టు కింద 30 గ్రామాల్లో అమలు - Free Solar Power To Villages

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.