ETV Bharat / technology

సెల్ఫ్‌ రిపేర్‌ కిట్‌తో మార్కెట్లోకి HMD కొత్త మొబైల్‌- ధర, ఫీచర్లు ఇవే! - HMD Skyline Launched - HMD SKYLINE LAUNCHED

HMD Skyline Launched: సెల్ఫ్‌ రిపేర్‌ కిట్‌తో HMD కొత్త మొబైల్‌ ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయింది. ఆకర్షణీయమైన లుక్‌తో హెచ్‌ఎండీ స్కైలైన్‌ పేరుతో ఈ మొబైల్​ రిలీజ్ అయింది. మరెందుకు ఆలస్యం దీని ధర, ఫీచర్లపై ఓ లుక్కేద్దాం రండి.

HMD_Skyline_Launched
HMD_Skyline_Launched (HMD)
author img

By ETV Bharat Tech Team

Published : Sep 17, 2024, 2:37 PM IST

Updated : Sep 17, 2024, 2:45 PM IST

HMD Skyline Launched: ఫిన్లాండ్‌కు చెందిన హెచ్‌ఎండీ సంస్థ సొంత బ్రాండ్‌పై కొత్త స్మార్ట్‌ఫోన్​ను ఇండియన్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. హెచ్‌ఎండీ స్కైలైన్‌ పేరుతో ఈ మొబైల్​ను లాంచ్ చేసింది. ఇంతకుముందు నోకియా బ్రాండ్‌పై ఈ సంస్థ ఫోన్లను తయారు చేయగా ప్రస్తుతం సొంత బ్రాండ్‌పై కొత్త మొబైల్​ను విడుదల చేసింది.

ఆకర్షణీయమైన లుక్‌తో డిస్‌ప్లే, బ్యాటరీని రీప్లేస్‌ చేసే సదుపాయంతో ఈ సరికొత్త మొబైల్​ను తీసుకొచ్చింది. ఈ కొత్త మొబైల్ ఔటాఫ్‌ ది బాక్స్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారంగా పనిచేస్తుంది. ఇది సెల్ఫ్‌ రిపేర్‌ కిట్‌తో వస్తోంది. అమెజాన్‌, హెచ్‌ఎండీ వెబ్‌సైట్‌లో పాటు ఇతర రిటైల్‌ స్టోర్ల ద్వారా ఈ కొత్త హెచ్‌ఎండీ స్కైలైన్‌ మొబైల్​ను కొనుగోలు చేయొచ్చు. ఈ సందర్భంగా దీని ధర, ఫీచర్లపై వివరాలు మీకోసం.

హెచ్‌ఎండీ స్కైలైన్‌ ఫీచర్లు:

  • డిస్​ప్లే: 6.55 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ పోలెడ్ స్క్రీన్‌
  • ప్రాసెసర్‌: స్నాప్‌డ్రాగన్‌ 7ఎస్‌ జెన్‌ 2
  • బ్యాటరీ: 4,600mAh
  • రిఫ్రెష్‌ రేటు: 144Hz
  • 1,000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌
  • కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌3 ప్రొటెక్షన్‌
  • మెయిన్ కెమెరా: 108 ఎంపీ
  • టెలీఫొటో సెన్సర్‌: 50 ఎంపీ
  • సెన్సర్‌: 13ఎంపీ
  • ఫ్రంట్ కెమెరా: 50ఎంపీ
  • కస్టమ్‌ బటన్‌
  • సెల్ఫ్‌ రిపేర్‌ కిట్‌
  • 33W వైర్డ్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌

హెచ్‌ఎండీ స్కైలైన్‌ కనెక్టివిటీ ఫీచర్లు:

  • వైఫై 6ఈ
  • బ్లూటూత్‌ 5.2
  • జీపీఎస్‌ యూఎస్‌బీ టైప్‌- సీ పోర్ట్‌

హెచ్‌ఎండీ స్కైలైన్‌ వేరియంట్స్: హెచ్‌ఎండీ కొత్త ఫోన్‌ కేవలం ఒక వేరియంట్‌లో మాత్రమే మార్కెట్లో లభిస్తుంది.

  • 12జీబీ+ 256జీబీ వేరియంట్‌

హెచ్‌ఎండీ స్కైలైన్‌ కలర్ ఆప్షన్స్:

  • నియోన్‌ పింక్‌
  • ట్విస్టెడ్‌ బ్లాక్‌

హెచ్‌ఎండీ స్కైలైన్‌ ధర:

  • 12జీబీ+ 256జీబీ వేరియంట్‌ ధర: రూ.35,999

సెల్ఫ్‌ రిపేర్‌ కిట్‌: హెచ్‌ఎండీ స్కైలైన్‌లో వెనకవైపు 108 ఎంపీ మెయిన్ కెమెరా, 50 ఎంపీ టెలీఫొటో సెన్సర్‌, 13ఎంపీ సెన్సర్‌ను అమర్చారు. ముందువైపు సెల్ఫీ కోసం 50ఎంపీ సెన్సర్‌ ఇచ్చారు. కస్టమ్‌ బటన్‌తో దీన్ని తీసుకొచ్చారు. ఇది సెల్ఫ్‌ రిపేర్‌ కిట్‌తో వస్తోంది. అంటే డిస్‌ప్లే డ్యామేజ్‌ అయినప్పుడు బ్యాక్‌ ప్యానల్‌ సాయంతో ఈ మొబైల్ డిస్‌ప్లేని మార్చుకొనే సదుపాయం ఉందని హెచ్‌ఎండీ కంపెనీ చెబుతోంది. అయితే ఈ హెచ్‌ఎండీ స్కైలైన్‌ ఫోన్ ఛార్జర్‌తో రాదు. ఇది 4,600mAh బ్యాటరీ, 33W వైర్డ్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. వైఫై 6ఈ, బ్లూటూత్‌ 5.2, జీపీఎస్‌ యూఎస్‌బీ టైప్‌- సీ పోర్ట్‌ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

ఐఫోన్ లవర్స్​కు అమెజాన్ బంపర్ ఆఫర్- రూ.39,999లకే యాపిల్ ఐఫోన్ 13! - iPhone 13 for Rs 39999

మోటో ఏఐ సూట్​తో కొత్త ఫోన్ లాంచ్- 5ఏళ్ల ఓఎస్, సెక్యూరిటీ అప్డేట్స్​తో స్పెషల్ ఆఫర్స్! - Motorola Edge 50 Neo Launched

Last Updated : Sep 17, 2024, 2:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.