Victims Alleges On Katasani Rambhupal : అమీన్‌పూర్‌లోని పద్మావతినగర్‌లో తమ ప్లాట్లను ఏపీ పాణ్యం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆక్రమించారని బాధితులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు. 1986లో 24 ఎకరాల్లో పంచాయతీ లేఅవుట్లో వేసిన ప్లాట్లు కొన్నామని, 2006లో మాజీ ఎమ్మెల్యే కాటసానితో పాటు సిస్ట్లారమేశ్ వాటిని ఆక్రమించారని వాపోయారు.
కాటసాని అనుచరుల వల్ల మాకు ప్రాణహాని ఉంది : తాజాగా హైడ్రా చర్యల వల్ల మళ్లీ తమ ప్లాట్లలోకి వెళ్లే దారి పునరుద్ధరణ అయిందని కాటసాని బాధితులు తెలిపారు. అలాగే తమ ప్లాట్ల విషయంలో కూడా న్యాయం చేస్తే ప్రభుత్వానికి రుణపడి ఉంటామన్నారు. కాటసాని అండతో రమేశ్ రెచ్చిపోతున్నారని, తన కుమారుడిని ఎమ్మెల్యే చేసేందుకే సిస్ట్లారమేశ్ పేదలను మోసం చేసి డబ్బు సంపాదించడం, ఫోర్జరీలతో భూములు ఆక్రమిస్తున్నారని మండిపడ్డారు. అయితే ఈ విషయంలో పోరాడుతుంటే కాటసాని అనుచరులు తమను భయపెడుతున్నారని, వారి వల్ల ప్రాణభయముందన్నారు. తమకు ఏదైనా జరిగితే దానికి కారణం కాటసాని రామ్‌భూపాల్ రెడ్డితో పాటు సిస్ట్ల రమేశ్ బాధ్యులని తెలిపారు.
'పంచాయతీ పర్మీషన్ ప్రకారంగా అమీన్పూర్ లేఅవుట్లో పద్మావతి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులమంతా ఫ్లాట్లు కోనుగోలు చేశాం. 2006లో రాంభూపాల్‌రెడ్డి మా పక్కనున్న 58 ఎకరాల్లో డెవలప్మెంట్కు తీసుకున్నారు. దారులన్నీ మూసేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. దీనిపై మేము పలుదఫాలుగా కేసులు పెట్టాం. ఇటీవల హైడ్రావారు మా ప్లాట్లు ఉన్న ప్రాంతంలో దారులను తీయడం జరిగింది. హైడ్రాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా ప్లాట్లు మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం' అని పద్మావతి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు.
"మా ప్లాట్లను చూసేందుకు వెళ్తే కాటసాని అనుచరులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. వారి ఆగడాలన్నింటిని ఇరు రాష్ట్రాల సీఎంల దృష్టికి తీసుకువెళ్తాం. కాటసాని రాంభూపాల్ రెడ్డి అనుచరుడు రామాగౌడ్ అనే అతను, సిస్ట్లా రమేశ్, రోహిత్ ఇలాంటి వారిని దయచేసి అసెంబ్లీలోకి రానివ్వకూడదని కోరుతున్నాం. ఆక్రమణలు తొలగించినందుకు హైడ్రా రంగనాథ్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా ప్లాట్లను మాకు అప్పజెప్పించే విధంగా చూడాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నాం'- తనూజా రెడ్డి, బాధితురాలు